Off The Record: జిల్లాలో అగ్గి రాజేసిన డీసీసీ నియామకం.. పంచాయతీ ఎన్నికల్లో నష్టమంటున్న కేడర్
- ఆసిఫాబాద్ జిల్లాలో అగ్గి రాజేసిన డీసీసీ నియమామకం..
- కొత్త అధ్యక్షురాలి సమక్షంలోనే పాత ప్రెసిడెంట్‌ని టార్గెట్ చేయడంతో వివాదం..
- మాజీ డీసీసీ విశ్వప్రసాద్ టార్గెట్‌గా ఇన్ఛార్జ్ శ్యాం నాయక్ ఆరోపణలు..
- అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థికి సహకరించారని ఆరోపణ..
- విశ్వప్రసాద్ నామినేటెడ్ పోస్ట్‌లను అమ్ముకున్నారన్న శ్యాం నాయక్..
- తాజా పరిణామాలపై గుర్రుగా మాజీ డీసీసీ వర్గం..
- ఇలాగే ఉంటే పంచాయతీ ఎన్నికల్లో నష్టమంటున్న కేడర్..
- తీరు మారకుంటే పక్క పార్టీలకు లాభం జరుగుతుందన్న టాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఆ నియోజకవర్గ కాంగ్రెస్‌లో మంటలు ఇప్పట్లో ఆరవా? తగ్గినట్టే తగ్గి మళ్లీఇప్పుడు ఎందుకు భగ్గుమన్నాయి? ఆ సెగల ధాటికి పార్టీ పంచాయతీ సీట్లు మలమల మాడిపోయే ముప్పు పొంచి ఉందా? రెండు వర్గాలు కొట్టుకుని ప్రత్యర్థులకు పంచాయతీల్ని సమర్పించుకునే పరిస్థితి ఎక్కడుంది? అగ్గి మళ్ళీ ఎందుకు అంటుకుంది?
Read Also: Off The Record: గద్వాల, వనపర్తి కాంగ్రెస్ లో పీక్స్ కు వర్గపోరు.. పంచాయతీ ఎన్నికల ముందు కంగారు
Also Read
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
కొమురం భీం జిల్లాలో గ్రూప్ వార్ కాంగ్రెస్ పార్టీకి గుదిబండగా మారుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల హడావుడిలో ఇద్దరు నాయకుల మధ్య పోరు పార్టీని ఎటు తీసుకువెళ్తుంతోదన్న భయాలు పెరుగుతున్నాయి. ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న విశ్వప్రసాదరావును తొలగించి ఆత్రం సుగుణకు పగ్గాలు అప్పగించింది అధిష్టానం. ఆమె ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న క్రమంలో ఇన్ఛార్జ్ శ్యాం నాయక్ ఆమె సమక్షంలోనే మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్‌రావ్ టార్గెట్గా తీవ్ర ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తానుంటే ప్రత్యర్థి గెలుపుకోసం పనిచేశారని ఇన్నాళ్ళు చెబుతూ వచ్చారాయన. తాజాగా అంతకుమించిన ఆరోపణలు చేశారు శ్యాంనాయక్. అసెంబ్లీ ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచారన్న ఆరోపణలతో.. వీళ్లిద్దరి మధ్య స్పర్ధలే కాకుండా…నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోయింది.
Read Also: CP Sajjanar : 10 గ్యాంగ్ లకు చెందిన 86 మంది బైండోవర్..
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్యాం నాయక్ పోటీ చేయగా అప్పుడు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న విశ్వప్రసాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మికి సపోర్ట్ చేశారన్నది ప్రధానమైన ఆరోపణ. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో సైతం గ్రూప్ వార్ తెరపైకి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్రంలో కులగణన విషయంలో పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా రెండు వర్గాల మధ్య గొడవ తారా స్థాయికి చేరింది. అప్పట్లో కుర్చీలు విసురుకోవడం, నిరసనలకు దిగడం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. తర్వాత కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉన్నా… మళ్ళీ డీసీసీ అధ్యక్ష పదవి మార్పుతో రచ్చ మొదలైంది. విశ్వప్రసాద్ రావ్ నామినేటెడ్ పోస్టులను సైతం అమ్ముకున్నాడని, మార్కెట్ కమిటీ చైర్మన్స్‌తో పాటు ఇతర పదవుల్ని బీఆర్ఎస్ కోసం పనిచేసిన వారికి ఇచ్చారని ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. అధిష్టానం డీసీసీని మార్చగా… విశ్వప్రసాద్ వర్గం వ్యతిరేకించింది. అయితే అధిష్టానం నిర్ణయాన్ని పాటించని వాళ్లు పార్టీలో కొనసాగకూడదన్న శ్యాం నాయక్ , 2023 ఎన్నికల సమయంలో విశ్వప్రసాద్ నలుగురిని బలిచేశారంటూ ఫైరయ్యారు.
Read Also: BJP: ఎన్నికలకు ఒక రోజు ముందు, బీజేపీలో చేరిన ఆప్ కీలక నేత..
కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు దారుడని విమర్శించడంతో… పార్టీలో మళ్లీ గ్రూప్ వార్‌కు తెర లేచిందని అంటున్నారు. సీనియర్ కార్యకర్తలను వదిలేసి అధికారాన్ని అప్పటి డీసీసీ మిస్ యూజ్ చేశారనే ఆరోపణలు సైతం చేశారట శ్యాంనాయక్. తిర్యాణి,జైనూర్ లలో ఇచ్చిన నామినేటెడ్ పదవుల విషయంలో ఏదో జరిగిందని మాట్లాడడం పార్టీలో అంతర్గతంగా చర్చకు దారితీసింది. ఇదే విషయంపై మాజీ డీసీసీ వర్గం గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. విశ్వప్రసాద్‌కు సరైన గుర్తింపు ఇవ్వాలని, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నష్టపోతుందన్న హెచ్చరికలు సైతం వస్తున్నాయట. గ్రామాల్లో పట్టుకోసం ఆరాటపడుతూ క్యాడర్‌ను సిద్ధం చేయాల్సిన నేతలు ఇలా గ్రూప్‌వార్‌తో టైంపాస్ చేస్తుంటే… సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కచ్చితంగా నష్టం జరుగుతుందని అంటోంది కాంగ్రెస్ కట్టర్ కేడర్. పార్టీ మద్దతుదారులకు భరోసా ఇవ్వడం మాట అటుంచితే… గ్రూప్‌వార్‌తో పక్క పార్టీ మద్దతు దారులు లాభపడతారన్న అంచనాలు పెరుగుతున్నాయి. అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని గొడవలకు చెక్ పెడితే తప్ప… పంచాయతీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ జిల్లాలో పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు దక్కవంటోంది కేడర్.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!