Chidambaram Controversy: సొంత పార్టీ ఆగ్రహానికి గురైన చిదంబరం.. ఆపరేషన్ బ్లూ స్టార్‌పై ఏం మాట్లాడారంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chidambaram Controversy: ఆపరేషన్ బ్లూ స్టార్‌పై మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ ఆగ్రహానికి గురి చేశాయి. ఆయన వ్యా్ఖ్యలను చాలా మంది కాంగ్రెస్ నాయకులు తప్పుపట్టారు. చిదంబరం ప్రకటనపై కాంగ్రెస్ నాయకుడు రషీద్ అల్వి స్పందిస్తూ .. “ఆపరేషన్ బ్లూ స్టార్ సరైనదా కాదా అనేది వేరే విషయం. కానీ 50 ఏళ్ల తరువాత పి.చిదంబరం ఆపరేషన్ బ్లూ స్టార్‌కు ఆదేశించి.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై తప్పు చర్య తీసుకున్నారని ఎందుకు చెప్పుకోవాలి” అని ప్రశ్నించారు.
READ ALSO: Durgapur Gang Rape: బెంగాల్‌లో మాకు రక్షణ లేదు, ఒడిశా వెళ్తాం: గ్యాంగ్ రేప్ బాధితురాలి తండ్రి..
Also Read
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
చిదంబరం ఏమన్నారంటే..
కసౌలిలో జరిగిన ఒక సాహిత్య ఉత్సవంలో చిదంబరం మాట్లాడుతూ.. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్‌ను పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంపై జరిగిన తప్పుడు ఆపరేషన్‌గా అభివర్ణించారు. ఈ నిర్ణయానికి మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. “నేను ఏ సైనిక అధికారిని అగౌరవపరచడం లేదు, కానీ స్వర్ణ దేవాలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది తప్పు మార్గం. కొన్నేళ్ల తరువాత, సైన్యాన్ని దూరంగా ఉంచడం ద్వారా దానిని తీసుకోవడానికి సరైన మార్గాన్ని మేము సూచించాము. బ్లూ స్టార్ తప్పుడు మార్గం, ఇందిరా గాంధీ ఆ తప్పుకు తన ప్రాణాలతో మూల్యం చెల్లించుకున్నారని నేను నమ్ముతున్నాను” అని అన్నారు.
ఏదైనా ఒత్తిడి ఉందా?..
బీజేపీ, ప్రధానమంత్రి చేసినట్లే చిదంబరం కూడా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నానని రషీద్ అల్వి అన్నారు. కాంగ్రెస్ పార్టీపై చిదంబరం పదే పదే చేస్తున్న దాడులు అనేక సందేహాలను, భయాలను రేకెత్తిస్తుండటం దురదృష్టకరం అని చెప్పారు. ఆయనపై ఇంకా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అల్వి ఎత్తి చూపారు. “కాంగ్రెస్ పార్టీపై దాడి చేయడం కొనసాగించడానికి ఆయనపై ఏదైనా ఒత్తిడి ఉందా అని ఆశ్చర్యపోతున్నాను? బ్లూ స్టార్‌కు ఇందిరా గాంధీ కారణమని, దాని కోసం తన జీవితాన్ని త్యాగం చేయాల్సి వచ్చిందని నేడు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? గత 11 ఏళ్లుగా బీజేపీ లోపాలను బహిర్గతం చేయడానికి బదులుగా చిదంబరం ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. బీజేపీ మొత్తం దేశాన్ని ఎలా నాశనం చేస్తుందో వివరించడానికి బదులుగా, ఆయన కాంగ్రెస్ పార్టీ లోపాలను ఎత్తి చూపుతున్నారు” అని విమర్శించారు.
READ ALSO: Saudi Arabia Military Support: పాక్ – ఆఫ్ఘన్ యుద్ధంలోకి సౌదీ అరేబియా ఎంట్రీ ఇస్తుందా?
తాజావార్తలు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!