Off The Record: కాంగ్రెస్ హైకమాండ్ ఆశీస్సులతో తెలంగాణ క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్నారు మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్. చాలామంది ఆశావహులు క్యూలో ఉన్నా… అందర్నీ వెనక్కి నెట్టి ఏఐసీసీ కోటాలో నేరుగా మంత్రి అయ్యారాయన. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగినప్పుడే ఆయనకు మంత్రి పదవి దక్కింది. అయితే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకుండానే నేరుగా రేవంత్‌రెడ్డి కేబినెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు అజహర్. అంతవరకు బాగానే ఉన్నా… ఇప్పుడాయన పదవి విషయంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయన్న చర్చ…
Karnataka: కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ శనివారం ఉదయం 9:30 గంటలకు ముఖ్యమంత్రి నివాసం కావేరిలో అల్పాహార విందుకు హాజరుకానున్నారు. పార్టీ హైకమాండ్ సూచనల మేరకు ఈ సమావేశం జరుగుతోంది.
Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్‌లో అధికార పంపిణీ వివాదం మరోసారి వేడెక్కింది. హైకమాండ్ డీకే శివకుమార్‌ను 2.5 సంవత్సరాలు వేచి ఉండమని గతంలో ఒప్పించగలిగినట్లు తెలిసింది. అయితే.. ఇప్పుడు సిద్ధరామయ్య తన వాగ్దానాన్ని నిలబెట్టుకునేలా కాంగ్రెస్ అధిష్టానం ఒప్పించలేకపోతుందనే వాదన మొదలైంది. 2023లో తిరిగి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చెరో 2.5 సంవత్సరాలు సీఎంగా ఉండాలని ఒప్పంద కుదిరినట్లు కాంగ్రెస్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ రహస్య చర్చలో శివకుమార్ మొదటి రెండునరేళ్ల…