ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపటి నుండి పరిపాలన మీద దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రుణమాఫీ పై ఫోకస్, విద్యాశాఖ మీద ఫోకస్, అన్ని హస్టల్స్ కి సన్న బియ్యం.. బీఆర్ఎస్ ఇచ్చిన సన్న బియ్యం కాదు.. నిజమైన సన్నబియ్యం ఇస్తామని అన్నారు. త్వరలో బ్యాంకర్ల సమావేశం ఉంటుందన్నారు. రుణమాఫీ పై చర్యలు, రైతుల రుణాలు ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతుల రుణాలు మాఫీ కోసం…
తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి తీరుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. డీఎంకే నేత పొన్ముడిని మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించడానికి అభ్యంతరం వ్యక్తం చేయడంపై గవర్నర్ ప్రవర్తనను ధర్మాసనం తప్పుపట్టింది.
తెలంగాణలో 3 లక్షల మంది అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ కు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో.. త్వరలో టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. వీలైనంత ఎక్కువ మంది డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని సర్కార్ చూస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను అనుగుణంగా ప్రస్తుత పోటీని తట్టుకునేలా సాంకేతికతను అందిపుచ్చుకుని అన్నదాతలకు ఉపయోగపడేలా కార్పొరేషన్లు పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈరోజు సచివాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖలపై తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యయసాయ 14 కార్పొరేషన్లకు చెందిన ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కార్పొరేషన్లు విజయవంతంగా రైతులకు సేవలు అందించేందుకు అవసరమైన పద్దతులను అవలంభించాలన్నారు. పంటల సాగులో ఇతర దేశాలు…