సమగ్ర కుటుంబ(ఆర్థిక, రాజకీయ, విద్య, సామాజిక, న్యాయ) సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధ్యయనానికి సామాజికవేత్తలతో స్వతంత్ర హోదాతో కమిటీ ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సమగ్ర సర్వే సమాచారాన్ని విశ్లేషణ చేసి చిన్న పొరపాటుకు అవకాశం లేకుండా మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు కృషి చేయాలని కోరారు.
కేసీఆర్ సర్వే ఎంత గొప్పగా ఉందో ఎస్సీ, ఎస్టీ ఉప కులాల లెక్క చూస్తే అర్థం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "సమగ్ర సర్వేలో ఎస్సీలలో 82 కులాలు అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉప కులాలు అలా సంఖ్య పెరిగింది. సమగ్ర సర్వే అర్థం పర్థం లేని లెక్కలు. సిగ్గుతో బయట పెట్టలేదు.…
Bhatti Vikramarka : రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే సహేతుకంగా, స్పష్టంగా చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే పై అసెంబ్లీలో లెక్కలతో సహా సీఎం సభ దృష్టికి తెచ్చారని, అసెంబ్లీలో చర్చ సందర్భంగా అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సలహాలు సూచనలు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే సహేతుకంగా, స్పష్టంగా చేశామని ఆయన పేర్కొన్నారు. 3.1శాతం మంది మాత్రమే ఇంటి యజమానులు సర్వేలో పాల్గొనలేదన్నారు. కొద్దిమంది ఇంటికి…
Damodara Raja Narasimha : గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో రోడ్ల మరమ్మత్తులు లేక రాష్ట్రంలో రోడ్లన్నీ అద్వాన్నంగా తయారయ్యాయి అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మంగళవారం అందోల్ నియోజకవర్గంలో సుమారు 30 కోట్లతో వివిధ రోడ్డు పునర్నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత పది సంవత్సరాల కాలంలో రోడ్లు మరమత్తు పనులు చేపట్టకపోవడం తో రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి అన్నారు. ప్రస్తుతం…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలంతా సహకరించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సర్వేపై వివిధ శాఖల అధికారులతో చర్చించడం జరిగిందని.. ఈ సర్వే పూర్తిగా ప్రభుత్వపరంగా చేపడుతున్నదని.. సర్వే ఆధారంగా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయబడతాయని అన్నారు.