Caste Census Survey: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే రెండో రోజు కొనసాగుతుంది. తొలిరోజు ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అధికారులు అంటించినున్నారు. ఇవాళ, రేపు కూడా ఇళ్లకు స్టిక్కరింగ్ వేయనున్నారు. ఎల్లుండి (9వ తేదీ) నుంచి కుల గణన సర్వే ప్రారంభం కానుంది. 60 రోజుల్లో కులగణన సర్వే పూర్తి చేయాలని టార్గెట్ చేయాలని అధికారులు భావిస్తున్నారు.
Read also: MLAs Fighting: కొట్టుకున్న ఎమ్మెల్యేలు.. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో హై టెన్షన్
రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశ సమగ్ర కుటుంబ సర్వే బుధవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలిరోజు ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికార కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ ప్రక్రియను ఈ నెల 9న ప్రారంభించి నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముందుగా ఇంటి నెంబరు, అందులో నివసిస్తున్న యజమాని పేరు నమోదు ప్రక్రియ సాగింది. ఇందులో ఒక్కో గానకు 150 నుంచి 175 ఇళ్లు కేటాయించి శుక్రవారం వరకు వివరాలు నమోదు చేయనున్నారు. అప్పటికి రాష్ట్రంలోని మొత్తం ఇళ్లు, వాటిలో నివసిస్తున్న కుటుంబాల సంఖ్య జాబితాను సిద్ధం చేస్తారు. ఆపై వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.
Read also: Ghaati : ఫస్ట్ లుక్ తో బయపెడుతున్న ‘అనుష్క’
ఈ సమాచారం ఆధారంగా ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులందరి పూర్తి వివరాలను సేకరించి నమోదు చేస్తున్నారు. మొదటి రోజు ఇంటి నెంబరు, నివాసి యజమాని పేరు వంటి వివరాలను నమోదు చేసిన అనంతరం ఎన్యుమరేటర్లు ఆయా ఇళ్లపై స్టిక్కర్లు వేశారు. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 11,97,554 ఇళ్లకు గానూ తొలిరోజు 95,106 (48 శాతం) ఇళ్లకు స్టిక్కర్లు అందజేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,17,44,954 కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రణాళికా విభాగం ప్రకారం 87,092 ఇళ్లను ఎన్యుమరేషన్ బ్లాక్‌లుగా విభజించారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 28,32,490 కుటుంబాలు నివసిస్తుండగా, వాటిని 19,328 ఎన్యూమరేషన్ బ్లాకులుగా విభజించారు. మొత్తం సర్వే పూర్తి చేసేందుకు ప్రభుత్వం 94,750 మంది ఎన్యూమరేటర్లు, 9,478 మంది సూపర్‌వైజర్లను నియమించింది.
IPL Auction 2025: ఇది తెలుసా.. ఐపీఎల్ వేలంలో ఇటలీ ఆటగాడు!