Stock Market: హమ్మయ్య.. తేరుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
- హమ్మయ్య.. తేరుకున్న మార్కెట్
- 24 గంట్లోనే నష్టాల్లోంచి లాభాల్లోకి
- భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్న సూచీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమ్మయ్య.. దేశీయ మార్కెట్ తెప్పరిల్లింది. నిన్న భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్.. 24 గంటల్లోనే వేగంగా కోలుకుంది. శుక్రవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్.. ప్రస్తుతం అన్ని రంగాలు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. హార్ముజ్ కోసం ఐరోపా, జపాన్ దేశాలు ఏకమయ్యాయి. ఇరాన్‌తో కలిసి సమస్యను పరిష్కరిస్తామని సంయుక్తంగా ప్రకటించాయి. దీంతో మార్కెట్‌కు సరికొత్త ఊపు వచ్చింది. ప్రస్తుతం సెన్సెక్స్ 839 పాయింట్లు లాభపడి 75, 046 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 260 పాయింట్లు లాభపడి 23, 362 దగ్గర కొనసాగుతోంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 92.94 దగ్గర రికార్డ్ కనిష్టానికి పడిపోయింది.
నిఫ్టీలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రధాన లాభాల్లో ఉండగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిండాల్కో, ఒఎన్‌జీసీ నష్టపోయాయి. పవర్, పీఎస్‌యు బ్యాంక్, ఐటీ సూచీలు ఒక్కొక్కటి 2 శాతం చొప్పున పెరగడంతో అన్ని రంగాల సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
ఇది కూడా చదవండి: Iran-Israel War: హార్ముజ్ కోసం ఏకమైన 6 దేశాలు.. నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే!
గత నెల 28 నుంచి పశ్చిమాసియాలో తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేస్తున్నాయి. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులతో చెలరేగిపోయింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు ఘోరంగా పతనం అయ్యాయి. అయితే ఆశ్చర్యంగా ఈ వారం ప్రారంభంలో మూడు రోజులు జోరుగా లాభాలు వచ్చాయి. ఇంతలోనే ఖతార్ గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ భీకర దాడులు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్, చమురు ధరలు పెరిగిపోతాయన్న భయాందోళనలు రేకెత్తడంతో నిన్న మార్కెట్ ఢమాల్ అయింది. నిన్న ఒక్కరోజే 12 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. మొత్తంగా గత 20 రోజుల యుద్ధంగా కారణంగా ఇప్పటి వరకు 37 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది.
ఇది కూడా చదవండి: Delhi Rain: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. వాహనదారులకు ఇక్కట్లు
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!