Rashmika Mandanna: నాకు యాక్టింగ్ రాదన్నారు.. గద్దర్ సినీ పురస్కారాల్లో రష్మిక ఎమోషనల్!
- తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 వేడుక
- వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నేషనల్ క్రష్ రష్మిక
- తెలంగాణ కోడలిని అంటూ రష్మిక కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Calls Herself Telangana Kodalu at Gaddar Awards 2025: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ సినీ పురస్కారాలు వరుసగా రెండో ఏడాది ఘనంగా ప్రదానం చేయడం విశేషం. తెలుగు సినిమా రంగానికి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిలిచిన ఈ అవార్డులు గతంలో పలు కారణాలతో దాదాపు పద్నాలుగేళ్ల పాటు నిలిచిపోయాయి. అయితే గత ఏడాది నుంచి మళ్లీ ఈ పురస్కారాలను ప్రారంభించిన ప్రభుత్వం.. సినీ రంగంలోని ప్రతిభను ప్రోత్సహిస్తూ ఉత్తమ చిత్రాల నిర్మాణానికి ప్రేరణనిస్తోంది. ఈసారి కూడా ఉగాది సందర్భంగా గద్దర్ సినీ అవార్డ్స్ 2025 వేడుకను నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ వేడుకలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు గాను ఉత్తమ నటి అవార్డును అందుకున్న ఆమె స్టేజ్‌పైనే భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకోవడం నాకు ఎంతో ప్రత్యేకమని తెలిపారు. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ… ‘గతంలో నేను ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నా. నా నటనపై విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నా నటనని మెచ్చి ఈ పురస్కారం ఇచ్చింది. రాష్ట్ర స్థాయి అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా ఉంది’ అని చెప్పారు.
Also Read
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
Also Read: AP High Court: భార్య వివాహేతర సంబంధం, పిల్లలకు డీఎన్ఏ పరీక్ష.. హైకోర్టు కీలక తీర్పు!
వేడుకలో రష్మిక చేసిన వ్యాఖ్యలు అందరి హృదయాలను హత్తుకున్నాయి. ‘ఇప్పటివరకు నన్ను కూతురిలా ఆదరించారు. ఇప్పుడు తెలంగాణ కోడలిగా మీ ముందుకు వచ్చాను. నా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ రష్మిక భావోద్వేగంగా మాట్లాడారు. ఆమె మాటలు విన్న వెంటనే ప్రేక్షకుల్లో హర్షధ్వానాలు మార్మోగాయి. రష్మిక ప్రసంగం జరుగుతుండగా నటుడు విజయ్ దేవరకొండ తల్లి భావోద్వేగానికి లోనవడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఈ సన్నివేశం వేడుకకు మరింత హైలైట్‌గా నిలిచింది. మొత్తం మీద గద్దర్ సినీ అవార్డ్స్ వేడుక సినీ ప్రముఖులు, అభిమానుల మధ్య ఆనందోత్సాహాలతో కొనసాగి తెలుగు సినీ పరిశ్రమకు మరింత ఉత్సాహాన్ని నింపింది. రష్మిక ఇటీవల హీరో విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!