గతేడాది చిన్న సినిమాగా విడుదల అయిన బలగం సినిమా అంచనాలకు మించి విజయం సాధించింది.ప్రతి ప్రేక్షకుడి నుండి ప్రశంసలను దక్కించుకుంది. తెలంగాణ గ్రామీణ సంస్కృతిని, సంప్రదాయాలను కళ్లకు కట్టినట్టు చూపిన ఈ ఎమోషనల్ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.జబర్దస్త్ కామెడీషోతో పాపులర్ అయిన వేణు ఎల్దండి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎవరూ ఊహించని విధంగా బలగం చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి.. తొలి మూవీతోనే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు వేణు. బలగం సినిమా కమర్షియల్‍గా కూడా…