తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక చిత్రం ‘శంకరాభరణం’. ఫిబ్రవరి 2 , 1980 వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో విడుదలయ్యింది. కాగా ఈ సినిమా విడుదలై నేటికి 45 సంవత్సరాలు పూర్తయింది. కళా తపస్వి శ్రీ కే.విశ్వనాథ్ దర్శకత్వంలో , పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై శ్రీ ఏడిద నాగేశ్వరరావు – ఆకాశం శ్రీరాములు నిర్మించారు . ఈ చిత్రం ఇక్కడ సంచలన విజయాన్ని సొంతం…
నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు జన్మజన్మలబంధం ఉన్న కథలు బాగా అచ్చి వచ్చాయనే చెప్పాలి. ఏయన్నార్ కు హీరోగా మంచి పేరు సంపాదించి పెట్టిన ‘బాలరాజు’ జానపదం అలాంటి కథనే. ఆ తరువాత జనం మదిలో ఆయన బాలరాజుగా నిలిచారు. ఇక 1964లో రూపొందిన ‘మూగమనసులు’ రెండు జన్మల కథతో తెరకెక్కి, ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలచింది. అందువల్ల ఏయన్నార్ తో పూర్వజన్మగాథలు నిర్మిస్తే విజయం సాధించవచ్చునని దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ తలచారు. అంతకు ముందు ఏయన్నార్…
‘శంకరాభరణం’ తరువాతే దర్శకులు కాశీనాథుని విశ్వనాథ్ ను అందరూ ‘కళాతపస్వి’ అంటున్నారు. అంతకు ముందు ఆయన తెరకెక్కించిన చిత్రాలను గమనించినా, వాటిలో సంగీతసాహిత్యాలకు, కళకు విశ్వనాథులవారు ఇచ్చిన ప్రాధాన్యం కనిపిస్తుంది. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన హాస్యప్రధాన చిత్రంలో సైతం సాహితీవిలువలు ప్రస్ఫుటంగా కనినిస్తూ ఉంటాయి. ఆయన దర్శకత్వంలో రూపొందిన కుటుంబకథా చిత్రం ‘సిరిసిరిమువ్వ’ తెలుగువారిని విశేషంగా అలరించింది. 1976 డిసెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం తరువాత వచ్చిన సూపర్ స్టార్ మూవీస్ సినిమాల నడుమ సైతం…