బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం “తలైవి”. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 10న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో “తలైవి” మూవీ టీం మోసం చేశారంటూ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. “తలైవి” సినిమా కోసం హైద్రాబాద్ నుంచి అక్రమంగా నిధులు తరలించారని కార్తీక్ అనే వ్యక్తి ఆరోపించారు. ఈ మేరకు అతను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.…