ఓ వైపు స్వాతి మలివాల్ కేసుకు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు రాజకీయాలు కూడా జోరందుకున్నాయి. దీని వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేసింది. కేజ్రీవాల్‌తో పాటు పార్టీని కూడా ఛార్జీషీటులో చేర్చింది.