మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన గొడవలో 4వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని ముగ్గురు విద్యార్థులు జామెట్రీ కంపాస్‌తో 108 సార్లు దాడి చేశారు. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.