Commercial Vehicles: కమర్షియల్ వెహికిల్స్‌ని ఒక్కో దేశంలో ఒక్కో రకంగా డిఫైన్ చేస్తుంటారు. సహజంగా.. సరుకు రవాణాకు లేదా ప్రయాణికుల రాకపోకలకు ఉపయోగించే వాహనాలను కమర్షియల్ వెహికిల్స్ అంటారు. ట్రక్కులు, వ్యాన్లు, బస్సులు, ట్యాక్సీలు, ఆటో రిక్షాలు, మోటర్ సైకిల్ ట్యాక్సీలు వంటివాటిని వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మన దేశంలో ఈ వాణిజ్య వాహనాల కొనుగోళ్లు రానున్న కొన్నేళ్లలో భారీగా పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.