ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాణిజ్య ఉత్సవ్ పేరుతో భారీ వాణిజ్య సదస్సును నిర్వహిస్తుంది. ఇవాళ, రేపు విజయవాడలో జరగనుంది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని, సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.ఎగుమతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికను, ఎగుమతుల వాణిజ్య పోర్టల్‌ను, వైఎస్సార్ వన్ వ్యాపార సలహా సేవలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారు. తర్వాత ప్రారంభోపన్యాసం చేస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గౌతమ్ రెడ్డి, కన్నబాబు, పెద్దిరెడ్డి, ,పేర్ని…