నవ్వుకే నవ్వు పుట్టించగల సమర్థుడు హాస్యనటబ్రహ్మ బ్రహ్మానందం. ‘నవ్వు, నవ్వించు, ఆ నవ్వులు పండించు’ అన్నట్టుగా ఎప్పుడూ నవ్వుతూనే కనిపించే బ్రహ్మానందం చిత్రసీమలో తన నవ్వుల నావ నడపడానికి ముందు చిరునవ్వుతోటి విషవలయాలను ఛేదిస్తూ ముందుకు సాగారు. చిన్నప్పటి నుంచీ నవ్వునే నమ్ముకొని హాస్యబలం పెంచుకున్నారు. బాల్యంలోనే తనకు తెలిసిన వారిని అనుకరిస్తూ, వారి చేష్టలను చూపించి తన చుట్టూ ఉన్న వారికి నవ్వులు పంచేవారు. ఏ ముహూర్తాన ఆయన కన్నవారు బ్రహ్మానందం అని నామకరణం చేశారో…