నవ్వుల రారాజు, ప్రముఖ సినీ హాస్యనటుడు రాజబాబు 87వ జయంతి వేడుక రాజమండ్రి గోదావరి గట్టున ఉన్న రాజబాబు విగ్రహం దగ్గర ఘనంగా జరిగింది. రాజబాబు సోదరుడు బాబి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జయంతి కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాజబాబు – ఈ నాలుగక్షరాలు పేరు ఒకప్పుడు తెలుగు సినిమాకు ఓ కమర్షియల్ ఎలిమెంట్! ప్రేక్షకులకు నవ్వులు పంచే యంత్రం. “నవ్వు నలభై విధాల గ్రేటు” అన్నది రాజబాబు చెప్పిన మంత్రం. తన నవ్వుల పువ్వులతో తెలుగువారికి హాస్యసుగంధాలు అందించారు రాజబాబు. తెరపై కనిపించగానే ప్రేక్షకుల పెదాలు నవ్వడానికి విచ్చుకొనేవి. ఇక ఆయన మెలికలు తిరిగే హాస్యాభినయం జనానికి కితకితలు పెట్టేది. నాటి టాప్ స్టార్స్ కు సమానంగా పారితోషికం పుచ్చుకున్న స్టార్ కమెడియన్ గానూ రాజబాబు…
(అక్టోబర్ 20న రాజబాబు జయంతి)“నవ్వు నాలుగందాల చేటు” అన్నది పాత సామెత, “నవ్వు నలభై విధాల గ్రేటు” అనేది నా మాట – అంటూ రాజబాబు తన నవ్వుల పువ్వులతో తెలుగువారికి హాస్యసుగంధాలు అందించారు. రాజబాబు తెరపై కనిపించగానే ప్రేక్షకుల పెదాలు నవ్వడానికి విచ్చుకొనేవి. ఇక ఆయన మెలికలు తిరిగే హాస్యాభినయం జనానికి కితకితలు పెట్టేది. ఒకానొక దశలో తెలుగు సినిమా కమర్షియల్ ఫార్ములాగా రాజబాబు కామెడీ నిలచింది. నాటి టాప్ స్టార్స్ కు సమానంగా పారితోషికం…