Brahmanandam: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేటి ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Brahmanandam: విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో ప్రముఖ సినీ నటుడు, హాస్యనటుడు బ్రహ్మానందం అసహనానికి గురయ్యారు. ఆయన ఎన్టీఆర్ గురించి మాట్లాడుతుండగా వేదికపై కొందరు సెల్ ఫోన్లు చూసుకుంటూ కూర్చున్నారు.