ఈరోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులంటే అందరికీ చులకన భావనే ఉంటుంది. సమయానికి ఉద్యోగానికి రాని ఉద్యోగులను ఎంతో మందిని చూస్తుంటాం. అయితే సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కాలేజీకి రంగులు వేయించడానికి నిధులు లేకపోవడంతో స్వయంగా ఆయనే పెయింట్ బ్రష్ చేతపట్టుకుని రంగులు వేస్తున్నారు. దీంతో నెటిజన్‌లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గురువారం ఉదయం స్థానికులు హుజూర్ నగర్ జూనియర్ కాలేజీ, డిగ్రీ కళాశాల గ్రౌండ్‌కు వాకింగ్‌కు వెళ్లగా అక్కడ ఆశ్చర్యపోయే సీన్…