హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ మహమ్మారి నీడలా వెంటాడుతూనే ఉంది. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా, విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ ముఠాలు తమ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నాయి. తాజాగా పంజాగుట్టలోని ఒక ప్రముఖ కాలేజీలో వెలుగుచూసిన డ్రగ్స్ ఉదంతం నగరవాసులను విస్తుపోయేలా చేస్తోంది. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన కాలేజీ ప్రాంగణమే మత్తు పదార్థాల వినియోగానికి వేదికగా మారడం గమనార్హం. పంజాగుట్ట పరిధిలోని నాగార్జున సర్కిల్ సమీపంలో ఉన్న ఒక ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు కొందరు అనుమానాస్పదంగా తిరుగుతుండటం…