స్వీడన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటలకే ఎలిసబెట్ లాన్ అనే మహిళా మంత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉండగా ఒక్కసారిగా ఎలిసబెట్ లాన్ ముందుకు కూలిపోయారు. దీంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు.
బెంగళూరులో గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక మంగళవారం అయితే 27 ఏళ్ల రికార్డును చెరిపివేస్తూ భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, ఇళ్లు నీటమునిగాయి. జనజీవనం అస్తవ్యస్థం అయింది. ఇదిలా ఉంటే వర్షాలు కారణంగా నిర్మాణంలో భారీ అంతస్తు బిల్డింగ్ కూలిపోయింది.
Russia Ukraine War : రష్యా సరిహద్దు నగరమైన బెల్గోరోడ్‌లో ఆదివారం ఒక భవనం పాక్షికంగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో కనీసం ఆరుగురు మరణించారు.. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు ఉక్రెయిన్ నుంచి వచ్చిన షెల్లింగ్ కారణమని అధికారులు చెబుతున్నారు.
అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి కుప్ప కూలిపోయింది. పాతాప్‌స్కో నదిలో ఒక పెద్ద కంటైనర్ షిప్ ఢీకొనడంతో నిమిషాల్లోనే వంతెన కూలిపోయింది.
దేశ రాజధాని ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో (Delhi Metro Station) ప్రమాదం జరిగింది. ప్రహారీ గోడ కూలడంతో ఒకరు మృతిచెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Mizoram : మిజోరాంలో విషాదం నెలకొంది. సోమవారం సాయంత్రం స్టోన్ క్వారీ కుప్పకూలింది. కార్మికులు మధ్యాహ్నం అన్నం తిని వచ్చిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఆర్మీలో చేరి దేశానికి సేవ చేశాడు.. చివరకు భారత 76వ స్వాతంత్ర్య దినోత్సవం రోజు.. జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ ప్రాణాలు వదిలాడు. కర్ణాటకలో జరిగిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య సంబరాలు అంబరాన్ని తాకాయి.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి.. ప్రతీ ఇంటిపై జెండా.. ప్రతీ గల్లీలో జెండా.. ప్రతీ ఊరిలో జెండా, ప్రతీ వీధిలో జెండా అనే తరహాలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న వేళ.. కర్ణాటకలోని దక్షిణ…
మదురైలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కుప్పకూలింది.. దాదాపు నగరంలో ఏడు కిలోమీటర్ల వరకు ప్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి… అయితే, ఇవాళ అకస్మాత్తుగా ఐదువందల మీటర్ల మేర ఫ్లైఓవర్ కూలిపోయింది… ప్రమాద సమయంలో ఫ్లైఓవర్ కింద పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనదారులు, నిర్మాణ పనుల్లో ఉన్న సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తోంది.. భారీ క్రేన్ సహాయంతో శిథిలాలను తొలగింపు ప్రయక్రియ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందినట్టుగా మరో నలుగురు తీవ్ర గాయాలపాలైనట్టుగా చెబుతున్నారు…