US: అమెరికాలో ఘోర ప్రమాదం.. కంటైనర్ షిప్ ఢీకొని కూలిన బ్రిడ్జి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి కుప్ప కూలిపోయింది. పాతాప్‌స్కో నదిలో ఒక పెద్ద కంటైనర్ షిప్ ఢీకొనడంతో నిమిషాల్లోనే వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు.. కొన్ని కార్లు, డజన్లు కొద్ది మనుషులు నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది. వారి కోసం అధికారులు గాలిస్తున్నట్లు సమాచారం. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది.
ఓ భారీ షిప్ వెళ్లాల్సిన దారిలో కాకుండా.. బ్రిడ్జి ఫిల్లర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా బ్రిడ్జి సెకన్ల కాలంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో వంతెనపై ఉన్న వాహనాలు నదిలో పడిపోయాయి. అంతేకాకుండా ఓడలో కూడా మంటలు చెలరేగాయి. అనంతరం షిప్ కూడా నదిలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు 20 మందికి పైగా వ్యక్తులు నదిలో పడిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
- CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
- AP Weather Update: ఈదురు గాలులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో కీలక హెచ్చరికలు జారీ..
సమాచారం అందుకున్న అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదం తర్వాత రెండు వైపుల నుంచి అన్ని మార్గాలను మూసివేసి ట్రాఫిక్‌ను నిలిపివేసినట్లు మేరీల్యాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ తెలిపింది. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను మాత్రం అధికారులు ఇంకా వెల్లడించలేదు. అయితే వాహనాలు నీటిలో మునిగి పోవడంతో పలువురు మృతి చెందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Prithviraj Sukumaran: ”ది గోట్ లైఫ్” 16 ఏళ్ళ ప్రయాణం.. 31 కిలోల బరువు తగ్గా: హీరో ఇంటర్వ్యూ
ఇదిలా ఉంటే బ్రిడ్జి కూలిపోతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బ్రిడ్జిని ఢీకొన్న నౌక సింగపూర్‌కు చెందిన ‘డాలీ’గా గుర్తించారు. ఇది శ్రీలంక రాజధాని కొలంబోకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. కాగా 1977లో మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెనను నిర్మించారు. ఫ్రాన్సిస్ స్కాట్ కీ అనే వ్యక్తి అమెరికాకు జాతీయ గీతాన్ని రాసిన వ్యక్తి. అతని పేరే ఈ బ్రిడ్జికి పెట్టారు.
ఇది కూడా చదవండి: SRH vs MI: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ!
The Francis Scott Key Bridge in Baltimore, Maryland which crosses the Patapsco River has reportedly Collapsed within the last few minutes after being Struck by a Large Container Ship; a Mass Casualty Incident has been Declared with over a Dozen Cars and many Individuals said to… pic.twitter.com/SsPMU8Mjph
— OSINTdefender (@sentdefender) March 26, 2024
తాజావార్తలు
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!