గత కొన్ని రోజులుగా హైపర్ సోనిక్ క్షిపణుల ప్రయోగాలకు సంబంధించిన వార్తలు మీడియాలో ప్రసారం అవుతున్నాయి. చైనా హైపర్ సోనిక్ క్షిపణిని ఆగస్టులో ప్రయోగించింది. ఈ ప్రయోగానికి సంబంధించిన సమాచారాన్ని ఆ దేశం రహస్యంగా ఉంచి, అక్టోబర్‌లో బహిర్గతం చేసింది. దీంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాడార్‌లకు అందకుండా భూమిచట్టూ ఈ క్షిపణి ప్రదక్షిణ చేసి టార్గెట్‌కు 30 కిలోమీటర్ల దూరంలో పడిండి. అయితే, రాడార్‌లకు అందకుండా ఈ హైపర్ సోనిక్ క్షిపణులు టార్గెట్‌ను ఛేదిస్తుంటాయి.…
ఒకప్పుడు అమెరికా రష్యా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. రెండు దేశాల మధ్య పచ్ఛన్నయుద్ధం జరిగింది. అయితే, 1991 దశకంలో యూఎస్ఎస్ఆర్ విచ్చిత్తి కావడంతో రష్యా ఆర్థికంగా కుదేలయింది. దీంతో అమెరికా తిరుగులేని శక్తిగా ఎదిగింది. అయితే, గత రెండు దశాబ్దాల కాలంగా ఆసియాలో చైనా ఆర్థికంగా క్రమంగా ఎదుగుతూ వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో అమెరికా తరువాత రెండో బలమైన ఆర్థిక వ్యవస్థగా మారింది. ఇప్పుడు అమెరికాను సవాల్ చేసే స్థాయికి ఎదగడంతో అమెరికా, చైనా…