సంక్రాంతి పండగ వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంబరాల్లో మునిగిపోతారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిండివంటలూ, రంగవల్లులతో పాటుగా కోడిపందేలతో తెగ ఎంజాయ్ చేస్తారు. ఈసారి కోస్తాంధ్ర మాత్రమే కాదు.. రాయలసీమలోనూ కోడిపుంజులు తొడకొట్టాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన కోటి రూపాయల కోడి పందెం గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. తాజాగా మరో కోడి పందెంకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఓ కోడిపుంజు సైలెంట్‌గా నిలబడి రూ.1.25…
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తు్న్నారు.. కోడి పందేలకు జోరుగా ఏర్పాట్లు చేశారు.. బరుల వద్ద పందెరాయుళ్ల కోసం అత్యాధునిక సౌకర్యాలను సైతం ఏర్పాటు చేశారు. పందేలు కాసేవాళ్లను కవ్వించి.. వందల కోట్ల రూపాయల జూదానికి తెర తీసేందుకు పందేంరాయుళ్లకు సమయం వచ్చేసింది.. ఇక, ఎన్నికల ఏడాది కావడంతో.. రాజకీయ నాయకుల తోడ్పాటు కూడా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.
సంక్రాంతి పందాల కోసం పెద్దఎత్తున కోడి పుంజులను పెంచి విక్రయిస్తున్నారు వ్యాపారులు.. కోడి పుంజుల పెంపకం ద్వారా వందలాది మందికి ఉపాధి కూడా లభిస్తుందని చెబుతన్నారు. కోడి పుంజులు అమ్మకాల రూపంలో ఏటా రూ.12 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోంది అంటే మామూలు విషయం ఏమీ కాదు.
సంక్రాంతి సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కోడి పందేలు జోరుగా జరుగుతుంటాయి. తెలుగు సంప్రదాయంలో భాగంగా కోడి పందేలకు అనుమతులు ఇచ్చినా, తెరవెనుక కోట్ల రూపాయల బెట్టింగ్‌లు జరుగుతుంటాయి. ప్రతి ఏడాది వందల సంఖ్యలో కోళ్లను, కోట్ల రూపాయల నగదులు, అనేక మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా, ఏడాది తిరిగేసరికి షరామామూలే. Read: ఆ కారిడార్‌పై చైనా కన్ను… అదే జరిగితే… అయితే, ఈసారి సంక్రాంతి పండుగ రాకముందే కొన్ని ప్రాంతాల్లో కోళ్ల పందేలు మొదలయ్యాయి.…