ఆదివారం ఇరాన్‌లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకేజీ కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 51 మంది మృతి చెందారు. అంతేకాకుండా.. 20 మంది గాయపడ్డారు. గత కొన్నేళ్లుగా దేశంలో జరిగిన ఘోర ప్రమాదాల్లో ఇదొకటి అని ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఇరాన్‌లోని దక్షిణ ఖొరాసన్ ప్రావిన్స్‌లో ఈ పేలుడు సంభవించింది.
12 dead in China Coal Mine Accident: భూకంపం సృష్టించిన విధ్వంసం నుంచి చైనా ప్రజలు తేరుకోకముందే.. ఆ దేశంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు గనిలో సంభవించిన పెను ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం చైనాలోని ఈశాన్య ప్రావిన్స్ హీలాంగ్‌జియాంగ్‌లో చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాలు ప్రకారం… హెంగ్షాన్ జిల్లా జిక్సీ నగరంలోని కున్యువాన్ బొగ్గు గనిలో బుధవారం ప్రమాదం…
Jharkhand: జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న బొగ్గు గని కుప్పకూలింది. జార్ఖండ్‌లోని భౌరా కొల్లేరీ ప్రాంతంలో శుక్రవారం అక్రమంగా నిర్వహిస్తున్న గని పైకప్పు కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక చిన్నారితో సహా ముగ్గురు మరణించారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ సింగరేణిలోని బొగ్గు గనిలో పైకప్పు కూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఏడుగురు పనిచేస్తుండగా ఒకరు మాత్రమే సురక్షితంగా బయటకు రాగా ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. తొలుత వారు మరణించారని ప్రచారం జరిగింది. అయితే సోమవారం రాత్రి సమయంలో ఇద్దరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. మరో నలుగురు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు సహాయక బృందం…
ప్రపంచవ్యాప్తంగా అగ్ని ప్రమాదాలు భారీ నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. చైనాలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భూగర్భ ప్రాంతంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈశాన్య చైనాలోని డాలియన్ సిటీలోని మార్కెట్ దిగువన ఉన్న అండర్ గ్రౌండ్‌లో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరగవచ్చని అంటున్నారు. గాయపడ్డ కార్మికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి…