పాకిస్థాన్ క్రికెట్‌లో గందరగోళం నెలకొటోంది. ఇటీవల బాబర్ ఆజం వైట్‌బాల్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అంతే కాకుండా సెలక్షన్ కమిటీలో సైతం మార్పులు జరిగాయి. తాజాగా ఇప్పుడు 2011లో భారత్‌ను వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపిన దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు.