రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7 నుండి జనవరి 2 వరకు సీఎం కప్ క్రీడోత్సవాలు (CM's Cup 2024) జరుగనున్నాయి. గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను గుర్తించి, ప్రోత్సాహం కల్పించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) చైర్మన్ శివసేనా రెడ్డి తెలిపారు. ఈ క్రీడోత్సవాలు 36 ఈవెంట్స్‌లో మూడు దశల్లో నిర్వహించనున్నట్లు శివసేనా రెడ్డి పేర్కొన్నారు.