ఆంధ్రప్రదేశ్‌కు క్రమంగా కంపెనీలు క్యూ కడుతున్నాయి.. మరో రూ.1425 కోట్ల పెట్టుబడులు సాకారం అవుతున్నాయి.. ఈ రోజు ఒక కంపెనీని ప్రారంభించడంతో పాటు మరో మూడు కంపెనీల నిర్మాణ పనులకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్ధాపన చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
డేవిల్ ఈజ్ బ్యాక్.. జనసైనికుల అంతు తెలుస్తా..! అంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా.. ఒక రోజు సీఎం అవ్వాలని అనుకుంటున్నా అంటాడు.. మరోరోజు ఎమ్మెల్యే అవ్వాలని చెబుతారు.. అసలు ఎమ్మెల్యే కూడా కాలేనోడు ఎందుకు తిరుగుతూన్నాడో అర్థం కాదు అంటూ పవన్ పై సెటైర్లు వేశారు.
ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలకు సీఎం వైఎస్ జగన్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు.. అక్టోబర్ నెల డెడ్ లైన్‌గా పెట్టారు.. అక్టోబరులోగా పని తీరు మెరుగు పర్చుకోకుంటే నో టికెట్స్ అంటూ తేల్చేశారు.. ఈ సమావేశంలో ముఖ్యంగా 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం జగన్.. అక్టోబర్ నాటికి పని తీరు మెరుగుపరుచుకోవాలని సూచించిన ఆయన.. 18 మంది పేర్లు చెప్పడం సరికాదన్నారు.
సంక్షేమ పథకాల విషయంలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్ వెనక్కి తగ్గడం లేదు.. తాజాగా మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది.. 'జగనన్న సురక్ష' పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు.. ఈ కార్యక్రమాన్ని జులై 1 నుంచి ప్రారంభిస్తారు..