తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం రోజురోజుకీ మరింత ముదురుతూనే ఉంది… ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, కేఆర్‌ఎంబీకి లేఖలు రాసిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు.. పదేపదే కేంద్ర జలశక్తి శాఖకు, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసినా.. వివాదాలు పరిష్కారం కావటం లేదని లేఖ ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణ అక్రమంగా వాడేస్తోందని దీనిని తక్షణం ఆపేలా చర్యలు చేపట్టాలని కోరారు.. ఉమ్మడి…
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వినిపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సబ్సిడీపై ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వనుంది వైఎస్ జగన్ సర్కార్.. ఉద్యోగులకు అవసరమైతే సబ్సిడీపై ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది.. మిగతా మొత్తాన్ని వాయిదా పద్దతిలో చెల్లింపులకు ఆస్కారం ఉంటుంది.. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు సంబంధించి ఎన్టీపీసీ సహా ఎస్సెల్ సంస్థలు రాయితీ ఇస్తాయని స్పష్టం చేసింది సర్కార్… ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు…
క్షేత్ర స్థాయి పర్యటనల పై ఫోకస్ పెట్టారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. కలెక్టర్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండింటిని ప్రతి వారం సందర్శించాలని సూచించారు.. జాయింట్ కలెక్టర్లు వారానికి నాలుగు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలన్న ఆయన.. మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు వారానికి 4 సచివాలయాలను సందర్శించాలని సూచించారు.. దీనివల్ల అక్కడ సమస్యలు ఏమున్నాయో తెలుస్తుందన్నారు సీఎం వైఎస్ జగన్. మరోవైపు.. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టగానే నేను వారానికి రెండు సార్లు గ్రామ,…
ఇవ్వాల్సిన సమయానికి సెకండ్ డోస్ వేయకపోతే వ్యాక్సిన్ వృథా అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ ద్వారానే కోవిడ్‌కు పరిష్కారం అన్నారు.. వ్యాక్సినేషన్‌లో ఇంకా చాలాదూరం మనం వెళ్లాల్సి ఉందన్న ఆయన.. సెకండ్ డోస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.. అసలు ఇవ్వాల్సిన టైంలో వారికి సెకండ్‌డోస్ ఇవ్వకపోతే వ్యాక్సిన్ వృథా అవుతుందని సూచించారు.. 45 ఏళ్లు పైబడిన వారికి 90 శాతం వ్యాక్సినేషన్ పూర్తయితే.. మిగిలిన కేటగిరీలపై దృష్టిపెట్టాలని…
కరోనా మహమ్మారి కలవర పెడుతూనే ఉంది.. ఎప్పుడు, ఎవరికి, ఎక్కడి నుంచి కరోనా సోకుతుందో తెలియని పరిస్థితి.. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్.. ప్రభుత్వ ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకితే 20 రోజుల పాటు సెలవు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. 15 రోజుల స్పెషల్ కాజువల్ లీవ్, 5 రోజులు కమ్యూటెడ్ సెలవులు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు.. కాగా, ఉద్యోగులకు…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదాలు ఈనాటిది కాదు.. అయితే, తాజాగా ఏపీ, తెలంగాణ మంత్రులు, నేతల మధ్య ఈ వ్యవహారంలో డైలాగ్ వార్ నడుస్తోంది… దీనిపై స్పందించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఇద్దరు సీఎంలపై మండిపడ్డారు.. కృష్ణా జలాల వివాదాలను ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఏటీఎంలాగా వాడుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. ఇరు రాష్ట్రాల మధ్య జల జగడాలను తీర్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవస్థలనే ప్రశ్నించే స్థాయికి పోయారని.. వ్యవస్థలను…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమైన జల వివాదం.. చినికి చినికి గాలివానగా మారుతూనే ఉంది.. ప్రధానికి, కేంద్రానికి, కృష్ణా రివర్ బోర్డుకు తాజాగా ఏపీ లేఖలు రాయడంపై భగ్గుమంటున్నారు తెలంగాణ మంత్రులు, నేతలు.. ఆ విమర్శలపై స్పందించిన ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. తెలంగాణ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా విడిపోయారు.. అక్కడా తెలుగువాళ్లున్నారు… ఇక్కడా తెలుగువాళ్లున్నారని.. బూతులు తిట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ…
ఆంధ్రప్రదేశ్‌లోని మండల పరిషత్, జిల్లా పరిషతుల్లో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించింది ప్రభుత్వం… గతంలో ప్రకటించిన ప్రత్యేక అధికారుల పాలన ఈ నెల 4వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో.. మరో ఆరు నెలల ప్రత్యేక పాలన కొనసాగుతుందంటూ వెల్లడించింది ఏపీ సర్కార్.. ఏప్రిల్ 8న మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు పూర్తయినప్పటికీ, హైకోర్టు ఆదేశం కారణంగా ఓట్ల లెక్కింపు చేపట్టలేదు. తాజాగా తదుపరి విచారణను జూలై 27వ తేదీకి వాయిదా వేసింది…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం విషయంలో రోజురోజుకీ విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి.. ఏపీ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తెలంగాణ మంత్రులు.. ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టుపై సీఎం వైఎస్ జగన్.. ప్రజల దృష్టి మళ్లించేందుకు కొత్త వాదన తెరమీదకు తెస్తున్నారని ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం కొత్త వాదన సరికాదన్న ఆయన.. నీటి వాటాలను కేంద్రం ఆధీనంలోకి తీసుకోండి అనడంలో ఆంతర్యం చెప్పాలి? ఏపీ…
జల వివాదం నిన్న ప్రధాని మోడీ లేఖ రాసిన ఏపీ సీఎం జగన్.. ఇవాళ ‘దిశ’ ఆమోదం కోసం కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఆరు పేజీల లేఖ రాశారు సీఎం జగన్. మహిళలు, పిల్లల పై లైంగిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో వీరి భద్రత కోసం దిశ చట్టం తీసుకుని వచ్చామని లేఖలో పేర్కొన్నారు. read also : జల వివాదంపై మేం…