Kiran Kumar Reddy: బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఏపీలో రాజకీయ పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. నేను సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులు చేసిన సంస్కృతి లేదు.. నేను ఏ ఒక్క రాజకీయ పార్టీని ఉద్దేశించి మాట్లాడడం లేదు.. అన్ని ప్రాంతీయ పార్టీలు ఒకేలా ఉన్నాయన్నారు.. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయన.. విజయవాడలో మీడియాతో మాట్లాడారు.. బీజేపీలో ఎందుకు చేరానో…
YSR EBC Nestham: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఓవైపు సంక్షేమ పథకాలు అమలు, మరోవైపు పార్టీ కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు.. ఇక, రేపు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్నారు సీఎం జగన్.. ఈ పర్యటనలో భాగంగా వైఎస్సార్ ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. మార్కాపురం పర్యటనకు రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరనున్న ఆయన.. 9.55 గంటలకు మార్కాపురం చేరుకుంటారు. ముందుగా ఎస్‌వీకేపీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్‌లో…
CM YS Jagan: మహిళా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త వినిపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వారికి ప్రత్యేక సెలవులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామి రెడ్డి తెలిపారు.. ప్రభుత్వం మహిళల ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మహిళలకు 5 ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేసింది.. అయితే, ఈ సౌకర్యం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం లేదు.. కానీ, ఇప్పుడు వారికి గుడ్‌న్యూస్ చెప్పింది…
Minister RK Roja: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యూత్ ఐకాన్ అంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి ఆర్కే రోజా.. అమరావతిలో తన శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె.. మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది ముగిసిన క్రమంలో ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష చేపట్టారు.. ఇక, ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి రోజాకు అభినందనలు తెలిపిన అధికారులు. ఈ ఏడాది కాలంలో మిగిలిన మంత్రులతో పోల్చుకుంటే తనకు ప్రశంసలు దక్కాయన్న రోజా.. ఉన్నతాధికారులతో…
COVID 19 : మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది.. కేంద్రం సూచనలతో ఆయా రాష్ట్రాలకు కూడా ఎలాంటి పరిస్థితి విచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధం అవుతున్నాయి.. అందులో భాగంగా ఇవాళ సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వైద్య ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టిన ఆయన.. కోవిడ్ తాజా పరిస్థితిపై ఆరా తీశారు.. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. కరోనా వ్యాపిస్తుందన్న…
CM YS Jagan: విద్యా శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. సంబంధిత శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. స్కూళ్లుకు వస్తున్న విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలని స్పష్టం చేశారు.. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్ధాయిలో విద్యాశాఖ ఇప్పటికే సినర్జీతో ఉంది.. దీన్ని మరింత సమర్ధవంతంగా వాడుకోవాలి.. పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్తుందని.. అయినా పిల్లలు బడికి రాని పక్షంలో తల్లిదండ్రులను ఆరా తీస్తున్నారని తెలిపారు. పిల్లలను బడికి…
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమంటూ ఇప్పటికే ప్రకటించింది బీఆర్ఎస్, తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయాన్ని ప్రకటించారు.. ఇక, వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొననున్నట్టు తెలుస్తోంది.. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారట.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించొద్దంటూ కార్మికులు ఓ వైపు ఉద్యమాలు చేస్తుండగానే కేంద్రం మాత్రం దానిని విక్రయించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా.. ఉక్కు…
Jogi Ramesh: నెల్లూరు టిడ్కో ఇళ్ల వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు సెల్ఫీలపై రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు.. టిడ్కో ఇళ్లను నేనే కట్టేసానని చెప్పుకోవడానికి సిగ్గులేదా చంద్రబాబు? అంటూ ఫైర్ అయ్యారు.. చంద్రబాబుది మేనిఫెస్టో పార్టీకాదు.. సెల్ఫీల పార్టీ.. చార్మినార్, తాజ్‌మహల్ కూడా తానే కట్టేశానని ఓ సెల్ఫీ తీసుకునేట్టున్నారు అంటూ ఎద్దేవా చేశారు.. తండ్రీ, కొడుకులు సెల్ఫీ బాబులు, కామెడీ రాజాలు అని కామెంట్ చేశారు.. చంద్రబాబే టిడ్కోఇళ్లన్నీ…
Gudivada Amarnath: నటసింహా, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కామెంట్లపై కౌంటర్ ఎటాక్ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన… గిగాబైట్ కు మెగా బైట్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి తేడా తెలియదన్న బాలయ్య వ్యాఖ్యలపై మండిపడ్డారు.. బాలకృష్ణ కూడా జగన్మోహన్ రెడ్డిపై మాట్లాడడం హాస్యాస్పదమంటూ ఎద్దేవా చేశారు.. వెన్నుపోటిదారుడికి సహకరించిన వాళ్లా సీఎం వైఎస్ జగన్ గురించి మాట్లాడేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జోకేష్ పాదయాత్ర (నారా లోకేష్…
Sai Prasad Reddy: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఉంది.. సీఎం వైఎస్ జగన్ మంత్రులను, ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదంటూ విపక్షాలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి.. అయితే, ఏకంగా అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసి ఇప్పుడు కాకరేపారు.. రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే…