Minister RK Roja: మంత్రిగా ఏడాది పూర్తిచేసుకున్న రోజా.. మిగతా మంత్రులతో పోల్చుకుంటే నాకే ప్రశంసలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister RK Roja: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యూత్ ఐకాన్ అంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి ఆర్కే రోజా.. అమరావతిలో తన శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె.. మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది ముగిసిన క్రమంలో ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష చేపట్టారు.. ఇక, ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి రోజాకు అభినందనలు తెలిపిన అధికారులు. ఈ ఏడాది కాలంలో మిగిలిన మంత్రులతో పోల్చుకుంటే తనకు ప్రశంసలు దక్కాయన్న రోజా.. ఉన్నతాధికారులతో కలిసి కేక్ కట్ చేశారు..
ఏపీ నుంచి అథ్లెటిక్ సింథటిక్ ట్రాక్ కావాలనే ప్రపోజల్ రాలేదని పీటీ ఉషా ఎలా అన్నారో తెలియదన్నారు మంత్రి రోజా.. పీటీ ఉషా తొలిసారి ఏపీకి వచ్చారు. పీటీ ఉషా ఆ విధంగా వ్యాఖ్యానించడం బాధ కలిగించిందన్న ఆమె.. సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ గురించి నాకు చెబితే నేను డిస్కస్ చేసేదాన్ని అన్నారు. మంత్రిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్నా.. క్రీడా, టూరిజం, సాంస్కృతిక శాఖలపై సమీక్ష నిర్వహించాను.. ఈ ఏడాది కాలంలో ఎన్నో ఫంక్షన్లు, ఈవెంట్స్ జరిగాయన్నారు. ఎన్నో ప్రసిద్ధ దేవాలయాల్లో ప్రసాద స్కీంను రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఆవిష్కరించాం.. క్రీడా, కళా రంగాల్లో ఉన్న వాళ్లని గుర్తించాం. సాంస్కృతిక రంగంలో తొలిసారిగా పోటీలు పెట్టాం అని వెల్లడించారు.
Also Read
ఇక, గ్లోబల్ ఇన్వస్టర్స్ సమ్మిట్, జీ-20 సదస్సులో కళాకారుల సేవలు తీసుకున్నాం.. జగనన్న బ్రాండ్ ఎలా ఉంటుందో గ్లోబల్ ఇన్వెస్టెర్స్ సమ్మిట్ ద్వారా అర్థమైందన్నారు మంత్రి ఆర్కే రోజా.. రాష్ట్రంలో అదానీ, అంబానీ, దాల్మియా వంటి వారు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించారు.. జీఐఎస్ సమ్మిట్‌లో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయన్నారు. 125 ఎంవోయూల్లో 45 డీపీఆర్ లు సమ్మిట్ చేశామని.. త్వరలోనే పనులు మొదలు కానున్నాయని వెల్లడించారు.. శిల్పారామాలకు 13 లక్షల మంది పర్యాటకులు వచ్చారని పేర్కొన్నారు. ఇక, యూత్ ఐకాన్ జగన్‌గా అభివర్ణించారు. డ్రగ్స్.. ఈవ్ టీజింగ్ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.. కాలేజీల్లో సదస్సులు పెట్టాం. 2023ని ఇయర్ విజిట్ ఏపీగా ప్రకటించాం. త్వరలో ఒబెరాయ్ హోటళ్లు భూమి పూజ జరగబోతున్నాయి. గండికోట, పిచ్చుల్లంక, తిరుపతి, విశాఖ వంటి ప్రదేశాల్లో హోటళ్లు నిర్మాణం జరగబోతున్నాయి. కూచిపూడి ఖ్యాతిని మరింత వ్యాప్తి చేశాం. క్రీడా రంగంలో టెన్నిస్ కోసం అకాడెమీల ఏర్పాటుకి స్థలాలు ఇచ్చాం.. టెంపుల్ టూరిజం వల్ల ఏపీ మూడో స్ఖానానికి వెళ్లిందని తెలిపారు మంత్రి ఆర్కే రోజా..
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!