CM YS Jagan: సూడాన్‌లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. వారు స్వస్థలాలకు చేరేంతవరకూ అండగా నిలవాలని స్పష్టం చేశారు.. దీని కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. స్వదేశానికి రాగానే వారిని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలి.. విమాన టిక్కెట్లు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని.. ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకుని వారి స్వస్థలాలకు…
విద్యార్థులకు, వారి తల్లులకు మరోసారి శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. రేపు జగనన్న వసతి దీవెన విడుదల చేయనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 912.71 కోట్లు బటన్ నొక్కి జమ చేయనున్నారు సీఎం జగన్.. అనంతపురం జిల్లా నార్పలలో కంప్యూటర్ బటన్ నొక్కి ఆర్ధిక సాయాన్ని విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు.
Mayor Sravanthi: నెల్లూరు నగరపాలక సంస్థ సమావేశంలో అజెండాలోని అంశాలను పట్టించుకోకుండా కేవలం రాజకీయ కారణాలతోనే తనపై దాడి చేశారని నెల్లూరు నగర మేయర్ స్రవంతి ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటో పెట్టడాన్ని తాను వ్యతిరేకించలేదని.. కేవలం ఫొటో గురించి మాట్లాడుతుండగానే ఒక్కసారిగా తన పోడియం వైపు దూసుకు వచ్చారన్నారు. అంతే కాకుండా సమావేశాన్ని వాయిదా వేసి వెళ్తుండగా తనపై ముగ్గురు కార్పొరేటర్లు దురుసుగా ప్రవర్తించారన్నారు. దీనిని తాను సహించబోనని హెచ్చరించారు మేయర్ స్రవంతి.. Read…
మే నెలలో రైతు భరోసా ఇన్‌స్టాల్‌మెంట్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని.. వైయస్సార్ రైతుభరోసా కింద రైతులకు డబ్బు జమ చేసేందుకు సిద్ధం కావాలని.. అర్హులైన రైతుల జాబితాలను వెల్లడించేందుకు చర్యలు తీసుకోవాలని.. మే 10 కల్లా అర్హులైన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని ఆదేశించారు సీఎం జగన్
Jagananna Mana Bhavishyathu: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.. ఇక, ఈ నెల 29వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. దీనిపై ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు పార్టీ కేంద్ర కార్యాలయం సమాచారం పంపించింది. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న అపూర్వ స్పందన, ప్రజలు భాగస్వామ్యం అవుతున్న తీరుతో సంతోషిస్తున్న వైసీపీ పార్టీ.. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమ షెడ్యూల్‌ను…
Vallabhaneni Vamsi Mohan: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత చింతమనేని ప్రభాకర్‌పై కౌంటర్ ఎటాక్ చేశారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. చింతమనేని వ్యాఖ్యలపై స్పందించారు.. ముందు వాడి ఊరిలో వాడిని చూసుకోమనండి.. బకెట్ జారిన.. అడుగు జారిన యదవలంతా నానికి, నాకు చెబుతున్నారు.. మంగమ్మ శపథాలు చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.. 23 మంది ఎమ్మెల్యేలు గెలిచి నలుగురు విభేదించిన టీడీపీ వెంటిలేటర్ మీద ఉందా? లేక…
Narayana: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను డంప్ కేంద్రంగా ప్రధాని నరేంద్ర మోడీ మార్చుతున్నారు.. కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు ఆపడం లేదు? అంటూ నిలదీశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. పారిశ్రామికవేత్త అదానీకి నొప్పి తగలకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఆయన.. విభజన చట్టాలను అమలు చేయించుకోలేని బలహీన స్థితిలో సీఎం జగన్ ఉన్నారంటూ మండిపడ్డారు.. జగన్మోహన్ రెడ్డి రోబో లాంటి వ్యక్తి.. ఆయనకు ఎలాంటి…
Jagananne Maa Bhavishyathu: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.. ఏ రాజకీయ పార్టీ అయినా రికార్డు సమయంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించింది లేదు.. ఎందుకంటే.. రోజుకో రికార్డు తరహాలో ప్రజలను కలుస్తున్నాయి వైసీపీ శ్రేణుల.. 12వ రోజు (ఏప్రిల్ 18) చివరి నాటికి 84 లక్షల కుటుంబాలు మెగా పీపుల్స్ సర్వేలో తమ ప్రతిస్పందనలను నమోదు చేసినట్టు వైసీపీ వర్గాలు…
తోడేళ్లన్నీ ఏకమైనా నాకేమీ భయం లేదు.. దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా అని వ్యాఖ్యానించారు సీఎం వైఎస్ జగన్.. నౌనాడలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. మూలపేట మూలన ఉన్న పేట కాదు.. అభివృద్ధికి మూలస్తంభం కానుందంటూ అభివర్ణించారు సీఎం జగన్.. 24 మిలియన్ టన్నులు సామర్థ్యంతో నాలుగు బెర్త్ లు కేటాయిస్తున్నాం.. పోర్ట్ కోసం 2954 కోట్లు ఖర్చుచేసి 24 నెలల్లో పుర్తి చేస్తాం అన్నారు.. 14 కిలోమీటర్ల రహాదారులు , 11…
శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. రాజధానిపై కీలక ప్రకటన చేశారు.. సంతబొమ్మాళి మండలం నౌపాడలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటా.. కాపురం కూడా విశాఖకు మారుతున్నాను.. అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖ అంటూ వ్యాఖ్యానించారు.. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా విశాఖలోనే బస చేస్తాను.. ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే అన్ని జిల్లాలు అభివృద్ధి చేస్తున్నాం అన్నారు సీఎం జగన్.. ఇక, ఉద్దానం కిడ్నీ సమస్యల…