మాదక ద్రవ్యాల నివారణపై ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మాదక ద్రవ్యాల నివారణపై పోలీసు అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.. ప్రతి కాలేజీలో ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నంబర్‌ను డిస్‌ప్లే చేయాలని సూచించిన ఆయన.. వీటికి సంబంధించి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టాలన్నారు..
విద్యార్థులకు మరో శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పటికే వేసవి సెలవులు ప్రారంభం కాగా.. స్కూళ్లు జూన్ 12న తిరిగి తెరుస్తారు.. అయితే, అదే రోజు వారికి విద్యాకానుక అందించాలని ఆదేశాలు జారీ చేశారు..
CM YS Jagan: సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు సిద్ధం అవుతోంది ప్రభుత్వం.. దీనిపై తగిన ఏర్పాట్లు చేయాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు సమీక్ష నిర్వహించిన సీఎం.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలందరికీ ఇళ్ల కార్యక్రమానికి సంబంధించి నిధులకు ఎలాంటి లోటు లేదని స్పష్టం చేశారు.. 2022-23 సంవత్సరంలో 10,200 కోట్ల రూపాయలు…
INDGAP Certification : ఇండ్ గ్యాప్ ధృవీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. గ్యాప్ సర్టిఫికేషన్ ద్వారా మన రాష్ట్ర అన్నదాతలు కష్టపడి నాణ్యమైన ప్రమాణాలతో పండించిన పంట దిగుబడులను తమకు జారీ చేసిన ధృవీకరణ పత్రముల ఆధారంగా ప్రీమియం ధరకు వారికి నచ్చిన చోట దేశీయంగా మాత్రమే కాకుండా యూరప్, యూఎస్‌తో సహా వందకు పైగా ఇతర దేశాలకు కూడా ఎగుమతి వ్యాపారం చేసుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పిస్తుంది.. మన దేశంలోని…
Bopparaju Venkateswarlu: మంత్రి వర్గ ఉపసంఘంతో చర్చలు ముగిసిన తర్వాత.. ఒక్కో ఉద్యోగ సంఘం స్పందన ఒకోలా ఉంది.. సమావేశంపై కొందరు సంతృప్తి వ్యక్తం చేస్తే.. మరికొందరు ఉత్తర్వులు వచ్చేవరకు ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు. సచివాలయంలో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు.. చట్ట బద్దంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదన్నారు.. రూ. 1800 కోట్ల బకాయిలు ఇంకా ఇవ్వాలన్న ఆయన.. అవి ఎప్పుడు చెల్లిస్తారో తెలియదని…
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు, పెండింగ్ నిధులు వంటి అంశాలపై చర్చించాం.. అన్ని అంశాలకు టైం బాండ్ పెట్టాం.. ఇక, మే ఒకటివ తేదీ నుంచి వరుసగా జీవోలు జారీ అవుతాయని వెల్లడించారు.. పీఆర్సీ కమిటీని ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు మంత్రి బొత్ప
టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు వైసీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దళితుల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారని ప్రశ్నించిన చంద్రబాబు.. దళిత బాంధవుడు ఎలా అయ్యారు? అని ప్రశ్నించారు.. దళితులపై దాడులకు కారకులైన చంద్రబాబు దళితులకు పెన్నిధి ఎలా అయ్యారు? అని నిలదీశారు.. ఎస్సీ నియోజకవర్గాలలో అధిక భాగం ఎందుకు ఓడిపోయారో అర్థం చేసుకో చంద్రబాబు అని సూచించిన ఆయన.. 28 పథకాలు దళితుల కోసం తన హయాంలో పెట్టినట్లు…
రోడ్ల నాణ్యతపైనా మరింత దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. వేసిన మరుసటి సంవత్సరమే మళ్లీ రిపేరు చేయాల్సిన పరిస్థితి రాకూడదన్నారు.. ఇంజినీర్లు వీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష సందర్భంగా ఉపాధి హామీపై కూడా సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాథి హామీలో భాగంగా ఈ ఏడాది 1500 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.. ఇప్పటి వరకూ 215.17…
Off The Record: శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత ఉంది. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఎలాగైనా ఆయన్ని ఓడించి తీరాలన్న పట్టుదలతో ఉంది అధికార పార్టీ. కానీ…స్థానికంగా ఉన్న గ్రూపులు వైసీపీని ఇరుకున పెడుతున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి , కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ … ఇలా ముగ్గురు మూడు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.…