Adimulapu Suresh: వచ్చే ఎన్నికల్లో గత ఎన్నికల తీర్పు రిపీట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్.. టీడీపీ, చంద్రబాబు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారన్న ఆయన.. మరోసారి టీడీపీకి ఘోర పరాజయం తప్పదన్నారు.. ఇక, సొంత ఇంటి కల నేర వెరుస్తున్న ప్రభుత్వం వైసీపీది.. 50 వేల మందికి పట్టాలు అమరావతిలో ఇవ్వాలని సంకల్పించామన్నారు.. సుప్రీం కోర్టు కూడా ఆర్ 5 జోన్ లో జరుగుతున్నది అభివృద్దే అనీ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం అన్నారు.…
సోషల్ మీడియా ద్వారా వేధింపులకు అడ్డుకట్ట పడాలన్నారు సీఎం జగన్.. దీనిపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు.. ఇక, సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులకు కచ్చితమైన ప్రోటోకాల్ ఉండాలని స్పష్టం చేశారు.. మహిళా పోలీసులు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులు, చేపడుతున్న బాధ్యతలపై సమగ్ర సమీక్ష చేయాలన్న ఆయన.. దీనిలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై ఆలోచన చేయాలన్నారు..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంఖుస్థాపన చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఇంత అద్భుతమైన కార్యక్రమం జరిగితే ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కడుపు మంటగా ఉంది అంటూ ఫైర్ అయ్యారు.. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా చేసిన పోరాటం వల్లనే చంద్రబాబు 2,300 ఎకరాల భూ సేకరణకు కుదించారన్న ఆయన.. ఇది వాస్తవం కాదా? భోగాపురం విభజన చట్టంలో ఉన్న విమానాశ్రయం కాదా? అని ప్రశ్నించారు
రైతులకు పూర్తిస్థాయిలో అండగా నిలవాలని ఆదేశించారు సీఎం జగన్. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికీ పరిహారం అందలేదన్న మాట రాకూడదన్న ఆయన.. పంట సహా ఇతర నష్టాలకు గ్రామ సచివాలయాల స్థాయి నుంచే వివరాలు తెప్పించుకోవాలన్నారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.. ఇది పూర్తి స్థాయిలో జరగాలని ఆదేశాలు జారీ చేశారు.
CM YS Jagan: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేసిన తర్వాత జరిగిన బహిరంగసభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా భావించబట్టే మీ ఇంటి ముందు నిలబడి ఆశీర్వదించమని అడగగలుగుతున్నా.. ఆ అడిగే అర్హతకాని, నైతికత కాని, మీ బిడ్డ మీరిచ్చిన అధికారంతో దేవుడి దయతో మెండుగా మంచి చేయగలిగాడని చెప్పగలుగుతున్నా.. ఇదే మాటలను చంద్రబాబు అడగగలరా? అనగలరా? చంద్రబాబు మీకు ముఖం చూపించగలడా? అంటూ ఫైర్…
Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఆ తర్వాత రూ. 23.73కోట్లతో చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఇటీవలే మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేశాం. ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుంది. తారకరామ తీర్థ…
పుదుచ్చేరిలో రజనీకాంత్ అభిమాన సంఘం నేతల సమావేశం అయ్యారు. ఏపీ మంత్రి రోజాకు.. రజనీకాంత్ అభిమానుల సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రజనీకాంత్ ను విమర్శించే స్ధాయి రోజాకు లేదని హితవుపలికారు..
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు.. విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి శంకుస్ధాపన చేయనున్న ఆయన.. చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారక రామ తీర్ధ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక, విశాఖపట్నం–మధురవాడలో వైజాగ్ ఐటీ టెక్ పార్క్‌కు శంకుస్ధాపన చేస్తారు.. ఉత్తరాంధ్రకే తలమానికమైన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి సీఎం వైఎస్ జగ ఈ రోజు భూమి…
Balineni Srinivasa Reddy: మాజీమంత్రి, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా విషయంలో వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.. నాలుగు రోజుల క్రితం వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అధిష్టానానికి సమాచారమిచ్చారు బాలినేని.. ప్రస్తుతం నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న బాలినేని.. ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు పార్టీ పెద్దలకు సమాచారాన్ని చేరవేశారు. అయితే, రాజీనామా వ్యవహారంలో వైసీపీ పెద్దలు రంగంలోకి దిగి…
అకాల వర్షాలతో కుదేలైన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైందన్న ఆయన.. ప్రాథమిక అంచనా మేరకు 3 లక్షల ఎకరాలలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయి. వరి, మామిడి, మొక్కజొన్న, అరటి, మిరప రైతులు ఆవేదనలో ఉన్నారు. బాధిత రైతులకు అండగా నిలిచి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు..