ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటిస్తున్నారు.. గుడ్లూరు మండలం మొండివారిపాలెంలో రామాయపట్నం పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారు..
అర్హులై సంక్షేమ పథకాలు అందని రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. అర్హులై వివిధ కారణాల వల్ల ప్రభుత్వ పథకాలు పొందలేక పోయిన వారికి లబ్ది చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రేపు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. రేపు సాయంత్రం 7.15 గంటలకు తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నివాసానికి రానున్నారు కేంద్ర మంత్రి షెకావత్… ఆయనకు రాత్రి విందు ఇవ్వనున్నారు ఏపీ సీఎం.. ఇక, మార్చి 4వ తేదీన సీఎం వైఎస్ జగన్‌తో కలిసి పోలవరం ప్రాజెక్టులోని నిర్వాసిత కాలనీలు, ప్రాజెక్టును సందర్శించనున్నారు. అనంతరం ప్రాజెక్టు వద్ద పీపీఏ, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు గజేంద్ర సింగ్ షెకావత్……
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది.. ఇప్పటికే దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది.. ప్రస్తుతం 13 జిల్లాలు ఉండగా.. ఆ సంఖ్య రెట్టింపు కాబోతోంది.. అంటే కొత్తగా 13 జిల్లాలు ఏర్పడి.. మొత్తంగా జిల్లాల సంఖ్య 26కు చేరుకోబోతోంది.. జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి.. 26 జిల్లాల ప్రతిపాదనల నివేదికను సీఎస్‌కు అందజేశారు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్.. ఆ తర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇక,…
పీఆర్సీ, పెండింగ్ సమస్య పరిష్కారం ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన బాటపట్టాయి.. 70కి పైగా డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాయి.. వెంటనే పరిష్కారం చూపాలంటూ ఉద్యమాన్ని చేపట్టాయి.. అయితే, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతూ వచ్చిన ప్రభుత్వం.. తాత్కాలికంగా ఉద్యోగుల ఆందోళనకు బ్రేక్‌లు వేసింది.. పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాయి.. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ సమీర్‌శర్మ, ఆర్థిక శాఖ…
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.. రూ.247 కోట్ల వ్యయంతో చేపట్టిన 12 అభివృద్ధి ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్న ఆయన.. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి రిసెప్షన్‌తో పాటు.. విజయనగరం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ నెక్కల నాయుడు బాబు కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు.. మొత్తంగా సాయంత్రం నుంచి రాత్రి వరకు విశాఖలో ఆయన పర్యటన కొనసాగనుంది.. Read Also: డిసెంబర్ 17, శుక్రవారం రాశిఫలాలు… ఇక, సీఎం వైఎస్…
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తినబాట పట్టారు.. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు.. మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇక, రేపు రాజధానికి చేరుకోనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఎల్లుండి కేంద్ర హోంశాఖ నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశానికి కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారానికి నోచుకోని సమస్యలు చాలా ఉన్నాయి.. కృష్ణా నది జలాల విషయం జల జగడం రోజు రోజుకీ రెండు రాష్ట్రాల…
టాలీవుడ్ ప్రముఖులు త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు. ఇందుకు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని బృందం రెడీ అయింది. అయితే ఇదివరకే ఈ భేటీ జరగాల్సిఉండగా.. పలు కారణాలతో వాయిదా పడింది. ఇకపోతే థియేటర్ టికెట్ల ధరలు, బెనిఫిట్ షోలు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ రంగం ఇలా సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురానున్నారు సినీ ప్రముఖులు. అలానే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కూడా చిరంజీవి బృందం కొన్ని మార్పులు కోరే…