ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది.. ఇప్పటికే దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది.. ప్రస్తుతం 13 జిల్లాలు ఉండగా.. ఆ సంఖ్య రెట్టింపు కాబోతోంది.. అంటే కొత్తగా 13 జిల్లాలు ఏర్పడి.. మొత్తంగా జిల్లాల సంఖ్య 26కు చేరుకోబోతోంది.. జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి.. 26 జిల్లాల ప్రతిపాదనల నివేదికను సీఎస్‌కు అందజేశారు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్.. ఆ తర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇక, ఉగాది పండుగ నాటికి ఈప్రక్రియ పూర్తి చేసి.. కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
కొత్త జిల్లాల ఏర్పాటులో పరిపాలనా సౌలభ్యంతో పాటు.. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటుచేస్తామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.. ఏపీలో ప్రస్తుతం 25 లోక్‌సభ స్థానాలు ఉండగా.. జిల్లాల సంఖ్య మాత్రం 13గా ఉంది.. వీటికి అదనంగా మరో 13 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి.