రెండో రోజు తన సొంత జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటన కొనసాగనుంది.. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకోనున్న ఆయన.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి సొంత జిల్లాలో పర్యటనకు సిద్ధం అయ్యారు.. రేపటి నుంచి మూడు రోజుల పాటు వైయస్సార్ కడప జిల్లాలో పర్యటించబోతున్నారు.. కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.. కడప అమీన్‌పీర్ దర్గాలో ప్రార్ధనలు, వివిధ ప్రెవేట్ కార్యక్రమాలకు హాజరు, కమలాపురంలో బహిరంగ సభ, పలు అభివృద్ది పనులకు శ్రీకారం, పులివెందుల, ఇడుపులపాయలలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనలు, అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు.. ఇలా మూడు రోజులు బిజీ బిజీగా గడపనున్నారు…