విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు క్షేత్ర స్థాయి పర్యటనతో సీఎం భద్రతా సిబ్బంది, అధికారులు పరుగులు పెట్టారు.. వరదలో.. అందునా జేసీబీపై నాలుగున్నర గంటల పాటు 22 కిలో మీటర్లు పర్యటించిన సీఎం చంద్రబాబు. కాన్వాయ్‌ని వీడి 22 కిలోమీటర్ల మేర పర్యటించడం ఇదే తొలిసారంటున్నాయి అధికారిక వర్గాలు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సీఎం భద్రతా వలయాన్ని దాటుకుని ఓ బైకు ముఖ్యమంత్రికి వద్దకు అత్యంత సమీపంగా దూసుకురావడం కలకలం రేపింది.