CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేటితో ముగిసింది. తన నివాసం నుంచి విమానాశ్రయానికి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బయల్దేరారు. ఢిల్లీ నుండి హైదరాబాద్ రాగానే ప్రెస్ మీట్ లో రేవంత్ మాట్లాడనున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 12.30 గంటలకు సెక్రటేరియట్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపారు. ఆరు గ్యారంటీల దరఖాస్తును సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం, మంత్రులు విడుదల చేయనున్నారు. మంచు కారణంగా రేవంత్ రెడ్డి, భట్టివిక్రమార్క వెళ్లే ఫ్లైట్ కాస్త ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. అయితే హైదరాబాద్ లో అడుగుపెట్టగానే నేరుగా సీఎం, డిప్యూటీ సీఎం సచివాలయానికి రానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరు గ్యారంటీల అమలుపై పూర్తీగా కసరత్ ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తున్నా కాంగ్రెస్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఆరు గ్యారంటీల దరఖాస్తును విడుదల చేయనున్నారు.
Read also: Corona Virus: ఈ రాష్ట్రంలో కరోనా ఉద్రిక్తత.. మొదట మాస్క్, ఇప్పుడు వారం హోమ్ ఐసోలేషన్ తప్పనిసరి
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై కసరత్తు ప్రారంభించిన విషయం తెలసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీల అమలుకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపరిపాలన నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రజాపరిపాలన కార్యక్రమంలో భాగంగా పది రోజుల పాటు గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారు. అయితే.. ఈ దరఖాస్తులు ఎక్కడ దొరుకుతాయి.. ఎలా పూరించాలి.. దానికి ఎలాంటి పత్రాలు కావాలి వంటి సందేహాలు ప్రజలకు ఉన్నాయి. అయితే.. వాటన్నింటికీ చెక్ పెడుతూ ప్రభుత్వం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దరఖాస్తు ఫారాన్ని విడుదల చేసింది. ఇక మరోవైపు ఇవాళ మధ్యాహ్నం ఆరు గ్యారంటీల దరఖాస్తును సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం, మంత్రులు విడుదల చేయనున్నారు.
Prabhas: ‘సలార్’ ఫ్యాన్స్‌కు సలామ్ కొట్టాల్సిందే!