ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస రివ్యూలతో సెక్రటేరియట్లో బిజీబిజీగా ఉన్నారు. నేడు ఉద్యోగాల భర్తీపై ఆయన రివ్యూ చేశారు. పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీ అధికారులను సీఎం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలతో పాటు నోటిఫికేషన్ల వివరాలతో రావాలని సీఎం ఆదేశించారు.
తెలంగాణలో పలు కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది. అందుకు సంబంధించి ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 54 మంది నియామకాలు, పదవీ కాలం పొడిగింపును తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. కాగా.. డిసెంబర్ 7న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగా, అప్పటి నుంచి గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ సలహాదారుల నియమకాలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా 54 కార్పొరేషన్ల ఛైర్మన్ నియామకాలు రద్దు చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల జేఏసీ కలిశారు. ఈ సందర్భంగా.. వీఆర్వో వ్యవస్థ రద్దయినప్పటి నుండి ఇప్పటి వరకు అన్యాక్రాంతమై, కబ్జాలకు గురైన ప్రభుత్వ భూముల వివరాలన్నీ ముఖ్యమంత్రికి అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం అనాలోచిత విధానంతో.. గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి ప్రజలకు అనేక ఇబ్బందులను గురిచేసిందని వారు పేర్కొన్నారు. దరిద్రమైన ధరణి వెబ్ సైట్ ద్వారా ఖరీదైన భూముల వివరాలన్నీ అన్యక్రాంతం చేశారని జేఏసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి…
ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుటకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయుటపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. అందులో భాగంగా ఆదివారం MCR HRDIT ని సందర్శించి, ఫాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సంస్థ కార్యకలాపాలు గురించి వాకబు చేశారు. ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను తెలుసుకున్నారు. అనంతరం సంస్థలోని వివిధ బ్లాకులను సోలార్ పవర్ వాహనంలో పర్యటించి పరిశీలించారు. సీఎంతో పాటు.. మంత్రి సీతక్క పాల్గొన్నారు.
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. ఇటీవలే తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన కేసీఆర్ ను రేవంత్ రెడ్డి సహా ఇతర మంత్రులు పరామర్శించనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణ మహాలక్ష్ములకు అభినందనలు.. సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం అన్న కార్యాచరణ మొదలైంది.. తెలంగాణ ఆడబిడ్డ మోములలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యం.. అందులో భాగంగానే నేడు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. సంక్షేమానికి ఇది మొదటి అడుగు. అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 13 బీసీ సంఘాలు అభినందించాయి. అంతేకాకుండా.. రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపాయి. మరోవైపు.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మూడు రోజులు అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుందాగా ప్రవర్తిస్తున్న తీరు.. ప్రజా సమస్యల పరిష్కరానికి ఎన్నికల తీరు చాలా గొప్పగా ఉందని ఆర్. కృష్ణయ్య తెలిపారు. గత ప్రభుత్వం నిరంకుశంగా, ప్రజా వ్యతిరేకంగా ప్రవర్తించడంతో.. నిరుద్యోగులు, బి.సి సంఘాలు పోరాటం చేసి ఆ ప్రభుత్వానికి తగిన…