Congress PAC- TPCC Meeting: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, టీపీసీసీ అడ్వజరీ కమిటీ ఈరోజు ( ఆగస్టు 23న) సాయంత్రం 5 గంటలకి కీలక సమావేశం కానున్నాయి.
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. సీసీఎల్ ఏలో 217 పోస్టులను మంజూరు చేసింది రేవంత్ సర్కార్. కొత్త 15 రెవెన్యూ మండలల్లో 189 పోస్టులను భర్తీ చేయనున్నారు. కొత్తగా ఏర్పడిన 2 రెవెన్యూ డివిజన్ల కోసం 28 పోస్టులు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది తెలంగాణ సర్కార్. ఈ పోస్టులను ఆదిలాబాద్ జిల్లా, మహబూబ్‌నగర్, వనపర్తి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భర్తీ చేయనున్నారు. భర్తీ…
Rajiv Gandhi Jayanti: భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనను స్మరించుకుంటున్నారు ప్రజలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సచివాలయం ముందు ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రాజీవ్ గాంధీ దేశ యువతకు స్ఫూర్తి. దేశ సమగ్రతను కాపాడే క్రమంలో ఆయన ప్రాణాలు అర్పించారు. భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడేలా తీర్చిదిద్దిన మహానేత రాజీవ్ గాంధీ” అని…
భారత్‌ను రెండుసార్లు విభజించిందే నెహ్రూ.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ఫైర్! భారత తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ భారత దేశాన్ని రెండుసార్లు విభజించారని పీఎం మోడీ ఆరోపించారు. ఒకసారి రాడ్‌క్లిఫ్ లైన్‌తో విభజించగా.. మన దేశానికి చెందిన సింధూ నదిని ముక్కలు చేసి మరోసారి విడగొట్టారన్నారు. దీంతో దేశంలో వ్యవసాయానికి భారీ నష్టం జరిగిందన్నారు. కొంత కాలానికి పాకిస్తాన్‌తో తాను చేసుకున్న సింధూ నది ఒప్పందంతో 80 శాతం నీరు ఆ దేశానికి వెళ్లిపోయాయని.. భారత్‌కు…
గణేష్ ఉత్సవాల మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి పొన్నం ప్రభాకర్! MCRHRD లో గణేష్ ఉత్సవాలు 2025 పై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, డీజీపీ జితేందర్.. జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్,హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో పాటు హైదరాబాద్ ,మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఇంకా ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఇక…
CM Revanth Reddy: తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర బీజేపీ కేంద్ర మంత్రులపై ఫైర్ అయ్యారు. ఇక ఈ ట్వీట్ లో భాగంగా.. రాష్ట్ర రైతాంగానికి అవసరం మేరకు.. యూరియా సరఫరా చేయకుండా.. నిర్లక్ష్య, వివక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తోన్న మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని, మోసపూరిత వైఖరిని ఎండగడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో గొంతు కలిపి పార్లమెంట్ వేదికగా తెలంగాణ రైతుల పక్షాన నిలిచిన…
షాకింగ్.. అనారోగ్యంతో కోట శ్రీనివాసరావు సతీమణి మృతి! ఇటీవల అనారోగ్య కారణాలతో కన్నుమూసిన కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి, ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ నివాసంలో కన్నుమూశారు. నిజానికి, కోట శ్రీనివాసరావు ఉన్నప్పటి నుంచే ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. చాలా కాలం నుంచే రుక్మిణి అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక, ఈ రోజు తెల్లవారుజామున ఆమె మరణించినట్లు సమాచారం. ఇక, కొద్దిసేపటి క్రితమే ఆమె అంత్యక్రియలు కూడా హైదరాబాద్‌లో పూర్తయినట్లు తెలుస్తోంది. కోట శ్రీనివాసరావు, రుక్మిణి…
రిచెస్ట్ వినాయకుడు.. ఏకంగా రూ. 474 కోట్లతో ఇన్సూరెన్స్ ఈ ఏడాది గణేష్ చతుర్థి ఉత్సవాలు మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే గణపయ్య భక్తులు విగ్రహాలు కొనుగోలు చేస్తున్నారు. ఊరు వాడలు వినాయక మండపాలతో ముస్తాబవుతున్నాయి. కాగా గణేష్ వేడుకలకు ముందే ముంబైలోని జీఎస్బీ సేవా మండల్ హాట్ టాపిక్ గా మారింది. తమ వినాయకుడికి ఏకంగా రూ. 474 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకుంది. దీంతో రిచెస్ట్ గణపతిగా రికార్డ్ సృష్టించాడు. గతేడాది కూడా…
CM Revanth: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సర్ధార్ సర్వాయి పాపన్నకు సముచిత గౌరవం ఇవ్వడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. సర్ధార్ పాపన్న విగ్రహం ఏర్పాటు కోసం శంకుస్థాపన నిర్వహించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వం హుస్నాబాద్‌లోని పాపన్న కోటను లీజుకు ఇచ్చిందని, తాము అయితే ఆ కోటను సంరక్షించడానికి చర్యలు ప్రారంభించామని వెల్లడించారు. హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్‌ను పోటీ చేయించడం కూడా అదే భావనలోనుంచే జరిగిందని అన్నారు. సీఎం రేవంత్ గాంధీ…