కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు దాటింది.. ఐదో నెలలో ఉన్నామని, ఇప్పటి వరకు ఇచ్చిన వాగ్దానాలపై క్లారిటీ లేదు.. బడ్జెట్ లేదు.. చేద్దామన్న నియత్ కూడా లేదన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్. ఇవాళ ఆయన రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లాగానే.. కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను పచ్చిగా మోసం చేసిందన్నారు. రేవంత్ వడ్లు ఎవరూ అమ్మవద్దు.. తాను వచ్చాక డిసెంబర్ 9వ తేదీన 500 బోనస్ ఇచ్చి కొంటామని చెప్పారన్నారు. డిసెంబర్ 9 ఇంకా రాలేదన్నారు ఎంపీ అర్వింద్. 2 లక్షల రుణమాఫీ ఎవరైనా అడిగారా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే పెట్టారని, రేవంత్ వరి కూడా సమయానికి కొంటలేడన్నారు.
అంతేకాకుండా..’కాంగ్రెస్ దిగజారిన రాజకీయాలు చేయడం వల్ల క్యాండిడేట్స్ కూడా దొరకట్లేదు. పనికిమాలిన క్యాండిడేట్ లకు టికెట్లు ఇస్తున్నారు. సీరియస్ అండ్ సీనియర్ కాంగ్రెస్ మెన్ కు రాహుల్ పై అంత భరోసా ఉంది అంటూ సెటైర్లు. కాంగ్రెస్ కు మొత్తం 30 సీట్లు కూడా దాటవు. ట్యాపింగ్ విషయంలో తప్పు చేస్తే జైల్లో వేయి.. అంతేకాని రోజూ అదే అంశంపై ఎందుకు మాట్లాడటం. ప్రజా సమస్యలపై కాకుండా ఇదే అంశాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు. ఆప్ కీ అదాలత్ ను నేను రెండు దశాబ్దాలుగా చూస్తున్నా.. రేవంత్ ది.. కామెడీ షో లాగా అనిపించింది. పొద్దున ఒక ల్యాండ్ గురించి మాట్లాడి.. సాయంత్రం సెటిల్ మెంట్ చేసుకోవడమే.
రేవంత్ కు సెటిల్ మెంట్లు బాగా తెలుసు.. రేవంత్ కొన్ని కార్యక్రమాలు యాక్టివ్ గా చేశాడు.. 15 ఏండ్ల వరకు ఇంకా యాక్టివ్ రాజకీయాలు చేసే అవకాశం ఉంది.. ఆయనకు భవిష్యత్ ఉంది.. కానీ కాంగ్రెస్ కు మాత్రం భవిష్యత్ లేదు.. అలాంటిది నేను కాంగ్రెస్ లోకి పోతానని కేటీఆర్ కు ఎలా అనిపించిందో.. దానికి కారణాలు కూడా ఆయన చెబితే బాగుండేది.. రేవంత్ బీజేపీలో వస్తానంటే కచ్చితంగా ఆహ్వానిస్తా.. రేవంత్ అసమర్థుడు కాదు.. కాంగ్రెస్ లో ఉంటే ఇంకా అసమర్థుడుగా అవుతాడు.. రేవంత్ మరో 15 ఏండ్లు.. కాంగ్రెస్ లో ఉంటే.. ఆయన జీవితమే ఖరాబ్ అవుతుంది.. రైతు బంధు ను ఖమ్మం మంత్రులు ఎత్తుకుపోయారు..’ అని ఎంపీ అర్వింద్.