ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయించింది.
ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ ఆధిక్యమెంతంటే..? బంగ్లాదేశ్తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 23 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. క్రీజులో శుభ్మన్ గిల్ (33*), రిషబ్ పంత్ (12*) ఉన్నారు. భారత్ 308 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగిన భారత్ ఆరంభంలోనే రెండు…
సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దసరా పండుగకు ముందుగానే సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే లాభాల్లో వాటా కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
అప్పుడు యువగళం… ఇప్పుడు దండయాత్ర..! అప్పుడు యువగళం… ఇప్పుడు దండయాత్ర.. అని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్.. యువగళం 100 కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే గ్రామప్రజల ఆనందోత్సాహాల నడుమ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ను ప్రారంభించడం సహా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలు తనపై…
Telangana Cabinet: ఈరోజు సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ లో తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు.
కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రేషన్ కార్డుల జారీకి విధివిధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అక్టోబరు 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సీఎం రేవంత్ సూచించారు. రేషన్ కార్డులు జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుల…
మొదటి రోజు ముగిసిన ఆట.. భారీ స్కోర్ దిశగా భారత్ చెన్నైలో బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. కాగా.. హోంగ్రౌండ్లో అశ్విన్ సెంచరీతో చెలరేగాడు. 108 బంతుల్లో శతకం సాధించాడు. ప్రస్తుతం క్రీజులో జడేజా (86*), అశ్విన్ ఉన్నారు. తొలి రోజు ఆటలో ముగ్గురు ఆటగాళ్లు అర్ధ సెంచరీలు చేశారు. మొదట బ్యాటింగ్కు దిగిన భారత్..…
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కీలక అంశాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు అధికారులు. స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరపున రూ.100 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రూపాలలో యూనివర్సిటీ నిర్వహణకు సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అంతేకాకుండా.. ఈ ఏడాది నుంచే స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభించే…
హోం మంత్రితో నటి జత్వానీ భేటీ.. ప్రభుత్వానికి ధన్యవాదాలు.. నాకు నష్టపరిహారం ఇవ్వాలి..! ముంబై నటి జత్వానీ వ్యవహారంలో ఏపీ పోలీసుల విచారణ జరుగుతోంది.. ఇప్పటికే కీలక అధికారులపై వేటు వేసింది సర్కార్.. అయితే, ఆ కేసులో ఈ రోజు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. హోం మంత్రి అనితతో సమావేశం అయ్యారు జత్వానీ.. అరగంట పాటు భేటీ జరిగింది.. తన మీదున్న కేసును విత్ డ్రా తీసుకోవాలని హోం మంత్రిని కోరారు జత్వానీ కుటుంబం.…