CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల కలను సాకారం చేసే దిశగా మరో అడుగు వేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతలో లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమంలో భాగంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం 12 మంది లబ్ధిదారులకు లాంఛనంగా ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా రూ. 20.19 కోట్లను 2,019 మంది లబ్ధిదారులకు విడుదల చేశారు. పైలట్ ప్రాజెక్ట్ కింద…