ఏపీలోని పోలీస్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేసారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. ఏపీ పోలీస్ వ్యవస్థను కేంద్రం ప్రక్షాళన చేస్తోందంటూ స్పష్టీకరణ చేసారు. ఏపీ పోలీస్ వ్యవస్థపై కేంద్రం టెలీస్కోపుతో చూస్తోంది. త్వరలోనే ఏపీలో పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కేంద్రం చర్యలు తీసుకోబోతోంది. నిబంధనల ప్రకారం పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు వ్యవహరించడం లేదు. పార్టీలు అధికారంలోకి వస్తాయి.. పోతాయి.. వ్యవస్థలు ముఖ్యం అనే విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు గుర్తుంచుకోవాలి. పోలీస్ ఉన్నతాధికారుల తీరు సరిగా…
ఏపీలో జగన్ పాలనపై బీజేపీ ఎంపీలు మండిపడ్డారు. వైసీపీకి ఎందుకు ఓటేశామని లెంపలేసుకుంటున్న పరిస్థితి వుందన్నారు ఎంపీ సుజనా చౌదరి. అప్రజాస్వామికంగానే అధికార పార్టీ స్థానిక సంస్థలను చేజిక్కించుకుంది.ఏ ఒక్క మంత్రి ఏం చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి. జగన్ ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతోందో ప్రజలకు అర్ధమైంది. తమకు బీజేపీ ఆశీస్సులున్నాయని వైసీపీలో కొందరు నేతలు చెప్పుకుంటున్నారు.. అదంతా అబద్దం. వైసీపీ మాకు శత్రువు కాదు కానీ.. రాజకీయ ప్రత్యర్ధి అన్నారు సుజనా చౌదరి.…
ఏపీలో భారీ వర్షాల వల్ల నష్టపోయినవారిని ఆదుకోవాలన్నారు సీఎం రమేష్. ఆంధ్రప్రదేశ్ లో గత రెండురోజులుగా కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలో వరదలు సంభవిస్తే ప్రభుత్వ చర్యలు శూన్యం. ఆస్తి, ప్రాణ నష్టం తీవ్రంగా జరిగింది. చిన్న చిన్న పనులు, పింఛా, చెయ్యేరు ప్రాజెక్ట్ ల గేటు మరమ్మత్తు పనులు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా ? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగం ఉందా లేదా? అసలు ప్రభుత్వం ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కడప…