బీజేపీ ఎన్నికలకు అన్నిరకాలుగా సిద్దమవుతోంది అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా ముందుకు వెళ్తున్నామని ఆమె తెలిపారు. 9 ఏళ్లుగా రాష్ట్రానికి పట్టిన పీడను ప్రారదొలెందుకు ప్రజలు రెఢీగా ఉన్నారు అంటూ విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో కొన్ని మీడియా సంస్థలు చెలిమెలో చాపలు పడుతున్నట్టు ఉంది. బీఆర్ఎస్ ను ఓడించాలని అంటే యువత ముఖ్యం.. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్న వర్గం యువతే.. యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. వాళ్ళే గేమ్ చేంజర్లు.. వాళ్ళు మా వైపు వస్తే కేసీఆర్ ను ఓడిస్తామని మురళిధర్ రావు తెలిపారు.
2023 ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్న నేను సంవత్సరం పాటు ఎమ్మెల్సీగా ఉంటాను మీకు అండగా ఉండి మీ ఉద్యోగాలు క్రమబద్దికరించే బాధ్యత నాది అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాజకీయాల నుంచి తాను అంత ఈజీగా పోయేటోడిని కాదని అన్నారు.
త్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకే రోజు రూ.6 వేల కోట్ల రుణమాఫీ ట్రెజరీ చరిత్రలో రికార్డ్ అని ఆయన అన్నారు. రూ.17 వేల కోట్లు 2018 వరకు మొదటి విడతలో రుణమాఫీ చేశాం.. రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక.. రూ.36 వేల వరకు రైతుల రుణాలను వెంటనే మాఫీ చేశామన్నాడు.
సిరిసిల్ల అంటేనే గీతన్న, నేతన్న.. ఉదయం కష్టపడే గీతన్న సాయంత్రం గీతన్నను కలుస్తాడు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేవుడు తాగే అమృతంను గీతన్న అందిస్తున్నాడు.. నేతన్న పని చేసి కష్టపడి ఆకలితో అనాడు చనిపోయారు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా జరుపుతుందని ఆయన వెల్లడించారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లాకు అనేక హామీలు ఇచ్చారని కిషన్ రెడ్డి అన్నారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదు సమాధానం చెప్పి ఎన్నికలకు వెళ్ళాలి.. మేమే పెడతామని ఉత్తర కుమార ప్రగల్బాలు పలికారు కదా.. మీరు పుట్టింది తెలంగాణ సమాజం కోసం కాదు.. మీ కుటుంబం కోసం మాత్రమే.. వరదల వల్ల నష్టపోయిన రైతులకు పది పైసలు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అని కిషన్ రెడ్డి అన్నారు.