మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు.. సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు మధ్యాహ్నం 12 గంటలకు లిబర్టీ చౌరస్తాలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయనున్నారు మోత్కుపల్లి. తర్వాత బషీర్ బాగ్ చౌరస్తా లోని మాజీ ఉప ఉపప్రధాని బాబూ జగ్జీవన్ రాం విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన తర్వాత నేరుగా తెలంగాణ భవన్ చేరుకోనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ సమక్షంలో మోత్కుపల్లి టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు.