తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఈ రోజు 7 మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన హుజురాబాద్ ఫలితం, పెట్రోల్, డీజిల్ ధరలు, వరి కొనుగోల్లు, ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు వంటి అంశాలపై తీసుకోనున్న నిర్ణయాలను వెల్లడించనున్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రల్, డీజిల్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. రాష్ట్రాలు కూడా తమ వ్యాట్ ను తగ్గించి ప్రజల భారం తగ్గించాలని కేంద్రం కోరింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్ నిర్వహించనున్న మీడియా సమావేశం ప్రాధాన్యతను సంపాదించుకుంది.