తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాశారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం… ఇప్పటికే పలు అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ నుంచి సీఎం వైఎస్ జగన్ వరకు లేఖలు రాస్తున్న ముద్రగడ.. ఈ సారి రైతుల సమస్యలను పేర్కొంటు ఏపీ, తెలంగాణ సీఎంలకు లేఖలు రాశారు.. ఇటీవల వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతు వెన్నెముక విరిగిపోచిందని.. తడిచిన ధాన్యం ప్రభుత్వాలు కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. తడిచిన ధాన్యం నుంచి ఆల్కహాల్ స్పిరిట్…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ధరలు పెంచి… ప్రజల నడ్డి విరస్తున్నారని ఫైర్ అయ్యారు. పాలన చేతకాకపోతే… రాజీనామా చేయండి సారూ అంటూ చురకలు అంటించారు. వైఎస్ పాలనలో మున్సిపల్ పన్ను, కరెంట్ బిల్లులు, బస్ ఛార్జీలు ఏవీ కూడా అణాపైసా పెంచింది లేదని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ పరిపాలనలో విద్యుత్తు, ఆర్టీసీ సంస్థలను నష్టాల్లో కూరుకుపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు. నష్టాలను పూడ్చు కొనేందుకు ఇప్పుడు బస్…
రైతుల సంక్షేమం విషయంలో దేశానికే మార్గదర్శి తెలంగాణ సీఎం కేసీఆర్ అంటూ ప్రశంసలు కురిపించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి… నల్గొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులకు ప్రధాన కారణం బీజేపీయే అంటూ మండిపడ్డారు… రబీ ధాన్యం ఇంకా 50 శాతం ఎఫ్ సీఐ గోదాముల్లో ఉంది, కేంద్ర ప్రభుత్వం రైల్వే వ్యాగన్లు ఏర్పాటు చేసి ఆ ధాన్యాన్ని వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు… ఇక, ధాన్యం సేకరణ పై…
వరి విషయంలో బీజేపీ-టీఆర్ఎస్ పార్టీల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా వుంది. రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోసగించే ప్రయత్నం చేస్తోంది తప్ప రాష్ట్రానికి మేలు చేయడం లేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. వాళ్ళ ప్రెస్ మీట్ లో చెప్పిందే చెప్పారు తప్ప కొత్తగా ఏంలేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భాష గురించి చెప్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ…
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తొలిగిపోవడంతో ఓరుగల్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుందా? ఎన్నికల కోడ్‌కి.. ఎమ్మెల్యేలకు లింకేంటి? కోడ్ అమలులో ఉన్నప్పుడు వారికి కలిసొచ్చిందేంటి? ఇప్పుడు వారిని ఇబ్బంది పెడుతున్న అంశం ఏంటి? రైతులకు ఎలా సర్దిచెప్పాలో తెలియక ఎమ్మెల్యేల ఆందోళన..! ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని ఏకగ్రీవంగా గెలిపించుకునేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా వ్యూహాలే రచించారు. చివరకు వారు అనుకున్నదే అయింది. అధిష్ఠానం దగ్గర మార్కులు వేయించుకున్నారు. ఇంత…
సీఎం కేసీఆర్‌పై మరోసారి నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. వానా కాలం తరహాలోనే.. యాసంగిలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బండి సంజయ్ హెచ్చరించారు. యాసంగిలో ధాన్యం కొనకపోతే.. అంతుచూస్తామని వార్నింగ్ ఇచ్చారు. మెడ మీద కత్తి పెడితే… ఫామ్ హౌస్ రాసిస్తావా అని చురకలు అంటించారు బండి సంజయ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతుల ప్రయోజనాల కోసం మర్యాదగా మాట్లాడితే….సీఎం కేసీఆర్ కు మాత్రం మైండ్ దొబ్బిందని ఫైర్ అయ్యారు. నాలుకకు,…
సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ముసుగులో ఉన్న ఒక స్మగ్లర్ అని… తెలంగాణలో పండే నాణ్యమైన బియ్యాన్ని ప్రైవేటుగా రైస్ మిల్లర్లకు అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నారని ఆగ్రహించారు. తెలంగాణకు కేంద్రం ఏం చేయడం లేదని.. అందులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు గురించి ప్రస్తావన చేస్తాడని ఆగ్రహించారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు స్థల కేటాయింపు జరగలేదని… రీ సైకిల్ బియ్యాన్ని టీఆర్ఎస్ నేతలు ఎఫ్.సి.ఐ…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని… దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని అబద్ధాలు ఆడరని ఆమె మండిపడ్డారు. మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారంటూ విమర్శలు చేశారు. రైతుల వడ్లు కొనుగోలు చేయకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. సీఎం కేసీఆర్ తన భాష మార్చుకోకుంటే ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. Read Also: వడ్ల…
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని కేసీఆర్ ఎండగట్టారు. కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. 700 మందిని పొట్టనపెట్టుకున్న హంతక పార్టీ బీజేపీ అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్రాన్ని ఒప్పించే దమ్ములేక తెలంగాణ బీజేపీ నేతలు నాటకాలు ఆడుతున్నారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి సిపాయిలా పోరాడి కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయించాలంటూ సవాల్ విసిరారు. బీజేపీ హయాంలో అన్నపురాశులు ఒకవైపు.. ఆకలి కేకలు ఇంకోవైపుగా పరిస్థితి ఉందని ఆయన…