ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సోమవారం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం తన సామాజిక బాధ్యతను విస్మరించిందని అన్నారు. రైతు, పేదల వ్యతిరేక విధానాలను కేంద్రం అవలంభిస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా దేశ ఆహార భద్రత కోసం బఫర్ స్టాక్స్ పెడుతుందని, రాజ్యాంగం ప్రకారం కేంద్రంపై బాధ్యత ఉందన్నారు. కోట్ల మంది బాధ్యతలను చూసే కేంద్రం చిల్లర కొట్టు యజమానిలా వ్యవహరించకూడదని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం దేశ రైతుల్నే గందరగోళంలోకి…
కేసీఆర్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ వేశారు. బాధ్యత గల ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ వ్యవహరించాలి. రైతులకు మేలు జరిగేలా వ్యవహరించాలన్నారు కిషన్ రెడ్డి. కేంద్రం దగ్గర ధాన్యం సేకరణ పాలసీ వుంది. దేశంలో బాయిలర్ రైస్ వాడడం లేదు. తెలంగాణలో ఎవరూ తినడం లేదు. ఏ రైస్ తినాలో ప్రజలపై వత్తిడి తీసుకురాలేం. ఆహార భద్రత కింద 80 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నాం అన్నారు కిషన్ రెడ్డి.
ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్రాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలయింది. న్యాయ విద్యార్థి బొమ్మనగారి శ్రీకర్ పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేయక రైతులు నష్టపోతున్నారన్నారు న్యాయవాది అభినవ్. దీనిపై విచారణ డిసెంబరు 6కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. తెలంగాణలో ధాన్యం సేకరణ అంశం రాజకీయంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు గుండెపోటు బారిన పడుతున్నారు. ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐతో రాష్ట్రం ఒప్పందం చేసుకుందని హైకోర్టులో దాఖలైన పిల్‌లో…
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ కేబినేట్ సమావేశం.. ప్రగతి భవన్ లో జరుగుతోంది. అయితే.. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. వరి ధాన్యం కొనుగోలు పై ముఖ్యంగా చర్చ జరుగనున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే…. యాసంగి లో వరి సాగు, కొత్త వరైటీ , ప్రత్యామ్నాయ పంటల పై కూడా చర్చ జరుగనున్నట్లు…
జనం పిట్టల్లా రాలిపోయారు..దొరగారు పట్టించుకోండని… సీఎం కేసీఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కరోనా సెకండ్ వేవ్ లో డాక్టర్లుంటే బెడ్స్ లేవని… బెడ్స్ ఉంటే ఆక్సిజన్ లేదని… దీంతో జనం పిట్టల్లా రాలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల. పారాసిటమోల్ వేసుకుంటే సరిపోతుందని… ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారని కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. దొరగారు కనీసం ఇప్పుడైనా చేతులు కాలినంక ఆకులు పట్టుకోకుండా ప్రజల ప్రాణాలను కాపాడాలని.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్…
టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు చోటులేదని..కేవలం భజన పరులకు మాత్రమే చోటు ఉందంటూ హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.నేడు పాల్వంచలో పర్యటించారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా పాల్వంచ తెలంగాణ నగర్ లో ఈటలకు ఘనస్వాగతం పలికారు బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాలను టిఆర్ఎస్ పార్టీ పట్టించుకోదని మండిపడ్డారు. ఈ తెలంగాణ నగర్ లో నివాసం ఉండేది నిరుపేదలని.. అందుకే వారికి ఇళ్ల పట్టాలు…
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.. ప్రపంచాన్ని భయపెడుతోన్న ఒమిక్రాన్ వేరియంట్‌తో పాటు.. పలు కీలక అంశాలపై చర్చించనుంది కేబినెట్.. ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణ చర్యలపై ఫోకస్ పెట్టనున్నారు.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు, టెస్టులు, ట్రేసింగ్.. క్వారంటైన్ తదితర అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.. కరోనా టెస్టులు పెంచే అవకాశం ఉండగా… మాల్స్, థియేటర్లు, పబ్‌లపై నియంత్రణా చర్యలు చేపట్టే విధంగా ఓ నిర్ణయానికి రానున్నట్టుగా సమాచారం. ఇక, వ్యాక్సినేషన్…
తెలంగాణలో ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల పైనే చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయం పై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో కేంద్రం వైఖరి రైతాంగాన్ని ఇబ్బంది పెరుగుతుంది అని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం సమగ్ర విధానం ప్రకటించాలి అని చెప్పిన సీఎం కేసీఆర్ రైతుల ప్రయోజనాల కోసం పోరాడేందుకు సిద్ధం అని ప్రకటించారు. ఈ విషయంపై కేంద్రాన్ని పార్లమెంటు వేదికగా నిలదీస్తాం అని చెప్పారు. ఉభయసభల్లోనూ మా ఎంపీలు గళమెత్తారు అని అన్న…
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మరికొద్దిరోజుల్లో కొలిక్కి రానుంది. ఆశావహులు కేసీఆర్ ని ప్రసన్నం చేసుకుని పదవులు పొందేరు. చాలామటుకు ఎమ్మెల్సీ పీట్లు ఏకగ్రీవం అయ్యాయి. మరికొన్నింటికి డిసెంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పెద్దల సభకు వెళ్ళాలనుకునేవారి కల సాకారం అయింది. ఇందులో చాలామంది రెండుసార్లు ఎమ్మెల్సీ సీట్లు పొందారు. పదవులు రానివారు నామినేటెడ్ పదవుల వైపు మొగ్గుచూపుతున్నారు. 2014లో తెలంగాణ కల సాకారం అయ్యాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి రెండోసారి…